జగదేవపూర్, ప్రజాతంత్ర, ఆగష్టు 29:జగదేవపూర్ మండల కేంద్రానికి నూతనoగా తహశీల్దార్ బాధ్యతలు చేపట్టిన శ్రవణ్ కుమార్ ను మండల కో- ఆప్షన్ సభ్యులు సయ్యద్ ఎక్బాల్ శాలువాతో ఘనంగా సన్మానించారు.ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ నిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటూ సేవలు అందించాలని అన్నారు . వీరితో పాటుగా మండల ఉప సర్పంచ్ల ఫోరం మండల అధ్యక్షుడు బింగి మల్లేశం,మండల బిఆర్ఎస్ ఉపాధ్యక్షులు బత్తిని శ్రీనివాస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.



