నూతన ఓటరుకై దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభం

1300 ఓటర్లు దాటిన పోలింగ్ స్టేషన్ యందు నూతన పోలింగ్ స్టేషన్ ఏర్పాటు.
 తాండూరు ఎన్నికల అధికారి ఆర్డిఓ శ్రీనివాసరావు.
తాండూరు, ప్రజాతంత్ర, డిసెంబర్ 14: నూతన ఓటర్లు నమోదుకై దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభం అయినట్లు తాండూరు ఎన్నికల అధికారి ఆర్డీవో శ్రీనివాసరావు తెలిపారు. గురువారం ఆర్డీవో కార్యాలయంలో ఎన్నికల అరిటార్నింగ్ అధికారి ఆర్డిఓ శ్రీనివాసరావు ఆధ్వర్యంలో తాండూరు నియోజకవర్గ రాజకీయ పార్టీల ప్రతినిధుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆర్ .డి. ఓ. గారు మాట్లాడుతూ – 01.01.2024 నాటికి 18 సంవత్సరాలు నిండబోయే యువతీ యువకులందరూ నూతన ఓటుకై ఫారం-6 లో దరఖాస్తు చేసుకోవాలి . స్థానిక బూత్ లెవెల్ అధికారి  దగ్గర లేదా ఓటర్ హెల్ప్ లైన్ యాప్ ద్వారా లేదా స్థానిక మీసేవ యందు దరఖాస్తు చేసుకోవాలని డిసెంబర్ 20వ తేదీ నుండి జనవరి 5వ తేదీ వరకు ఇట్టి అవకాశం కలదు .
కావున రాజకీయ పార్టీల ప్రతినిధులు అందరూ యువతీ యువకులకు మీ వంతుగా అవగాహన కల్పించి నూతన ఓటరుగా నమోదు చేయు ప్రక్రియలో భాగస్వామ్యం కావాల్సిందిగా కోరారు. . ఓటర్ కార్డులో మార్పు చేర్పుల కొరకు ఫారం-8, చనిపోయిన , డబుల్ ఓటర్ల మరియు శాశ్వత వలస ఓటర్ల తొలగింపుకై ఫారం-7 లో దరఖాస్తు చేయుటకు తెలియజేశారు.
ఈ కార్యక్రమంలో రాజకీయ పార్టీల ప్రతినిధులు, సహాయ ఎన్నికల నమోదు అధికారులు/ తహాశీల్దార్లు తారా సింగ్ , మునీరుద్దీన్, వెంకటస్వామి, డిప్యూటీ తహాశీల్దార్ విజయేందర్, రెవెన్యూ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *