నులిపురుగుల నివారణకు కృషి చేయాలి

 ఆమనగల్లు, ప్రజాతంత్ర ఆగస్టు 3 : జాతీయ నులిపురుగుల నివారణ దినోత్సవాన్ని పురస్కరించుకొని ఆమనగల్లు మండల కేంద్రంలో  జిల్లా బాలికల ఉన్నత పాఠశాల, కస్తూర్బా గాంధీ విద్యాలయం గిరిజన బాలికల వసతి గృహం పలు పాఠశాలలో జెడ్పిటిసి అనురాధ, కౌన్సిలర్ యాదమ్మ శ్రీశైలం యాదవ్, వైస్ ఎంపీపీ జక్కు అనంతరెడ్డి, మున్సిపల్ చైర్మన్ రాంపాల్ నాయక్, వైస్ చైర్మన్ దుర్గయ్య, డిప్యూటీ డి ఎం హెచ్ ఓ గీత తో కలిసి విద్యార్థినులకు నులిపురుగుల నివారణపట్ల  తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి వివరించి, ప్రభుత్వం సరఫరా చేస్తున్న  నులిపురుగు నివారణ మందులను విద్యార్థినులకు అందించారు. ఈ సందర్భంగా గీత మాట్లాడుతూ 19 సంవత్సరాల లోబడి వయసు కలిగిన ప్రతి ఒక్కరూ నులిపురుగుల మందులు వాడాలని, వ్యక్తిగత పరిశుభ్రత పాటించాలని, వేడి వస్తువులను ఆహారంగా తీసుకోవాలని మరియు భోజనానికి ముందు చేతులు సబ్బుతో శుభ్రపరచుకోవాలని సూచించారు. నులిపురుగుల నివారణ మందులు వాడడం వలన నులిపురుగులను పూర్తిగా నివారించవచ్చని, తద్వారా  విద్యార్థుల శారీరక ఎదుగుదలకు ఎలాంటి ఇబ్బందులు ఉండవని సూచించారు. ఈ కార్యక్రమంలో వైద్య అధికారి పరీక్షిత్ నరేంద్ర, కస్తూర్బా గాంధీ స్పెషల్ ఆఫీసర్ పద్మ,  వైద్య సిబ్బంది తిరుపతిరెడ్డి, శ్రీనివాస్, పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *