పటాన్ చెరు,ప్రజాతంత్ర,అక్టోబర్ 31: కుల మతాల బేధం లేకుండా అన్ని వర్గాల వారిని సమ దృష్టితో చూడాల్సిన అవసరం ఉందని కాంగ్రెస్ నాయకులు నీలం మధు ముదిరాజ్ సతీమణి కవిత అన్నారు.పటాన్ చెరు మండలం క్యాసారం గ్రామంలో మైబి సుభాని దర్గాలో పూలచద్దర్ కప్పి ప్రార్థనలు నిర్వహించారు. ప్రజల బాగోగులు చూసే నాయకుడు సమాజానికి అవసరమని అలాంటి వారిని ఎన్నుకోవాలి అన్నారు. నాయకుల కోసం సమాజం కోసం నాయకుడు అయ్యే వ్యక్తి నీలం మధు ముదిరాజ్ అని తెలిపారు. వచ్చే ఎన్నికల్లో నీలం మధు కి ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపించాలని ఆమె అన్నారు. నియోజకవర్గ ప్రజలను కంటికి రెప్పలా కాపాడుకునే మనస్తత్వం నీలం మధు కు ఉందని చెప్పారు. ఇప్పటికే చాలామంది మీ వెంట ఉండి మీకు మద్దతు తెలిపి భారీ మెజార్టీతో గెలిపిస్తామని వస్తున్నారని చెప్పారు.ఈ కార్యక్రమంలో ఎండి అమీర్,ఎండి పాషా,ఎండి ఇమ్రాన్, షాన్,ఖలిం, మహమూద్, మబ్బుల్, జాంగిర్, ఇస్మాయిల్, సుల్తాన్, రాజు గౌడ్,మల్లేశం, నరేష్ యాదవ్,అశోక్, శ్రీనివాస్ చారి,యాదయ్య, మాణిక్యం, ముస్లిం సోదరులు,ఎన్ఎంఆర్ యువసేన సభ్యులు, తదితరులు పాల్గొన్నారు.
నీలం మధు సతీమణి కవిత దర్గాలో ప్రత్యేక పూజలు





