పటాన్ చెరు, ప్రజాతంత్ర, నవంబర్ 21: పటాన్ చెరు నియోజకవర్గ బీఎస్పి పార్టీ అభ్యర్థి నీలం మధు ముదిరాజ్ కి ఘన స్వాగతం పలికిన క్యాసారం గ్రామ ప్రజలు,పటాన్ చెరు నియోజకవర్గ బీఎస్పి పార్టీ అభ్యర్థి నీలం మధు ముదిరాజ్ ప్రచారంలో భాగంగా క్యాసారం గ్రామం కి వచ్చిన సందర్భంగా మహిళలు మంగళ హారతులతో స్వాగతం పలికారు.ఈ సందర్భంగా నీలం మధు ముదిరాజ్ మాట్లాడుతూ… గ్రామంలో ఉన్న సమస్యలలో ప్రధానంగా పిల్లలకి హైస్కూల్ లేదు అని అలాగే బస్ సౌకర్యం కూడా కావాలని అడిగారని గెలిచిన వెంటనే అన్ని పరిష్కరించి ఎల్లపుడు మీకు అందుబాటులో ఉంటానని తెలిపారు. గెలిచిన వెంటనే అన్ని పరిష్కరిస్తా అని ప్రతి ఒక్కరు ఏనుగు గుర్తుకు ఓటు వేయాలని తెలిపారు.ఈ కార్యక్రమంలో బీఎస్పి పార్టీ నాయకులు, ఎన్ఏంఆర్ యువసేన సభ్యులు, నీలం మధు అభిమానులు, భారీ ఎత్తున పాల్గొన్నారు.
నీలం మధు ముదిరాజ్ కి ఘన స్వాగతం పలికిన క్యాసారం గ్రామ ప్రజలు



