దివ్యాంగులకు రెండు కుట్టు మిషన్లు అందజేత – సీఎం కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం
పటాన్ చెరు, ప్రజాతంత్ర, జూలై 24: రాష్ట్ర మున్సిపల్, ఐటి శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు జన్మదినం సందర్భంగా సోమవారం దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి, గిఫ్ట్ ఏ స్మైల్ కార్యక్రమంలో భాగంగా దివ్యాంగుల జీవనోపాధి కేంద్రం ప్రారంభం, వృద్ధాశ్రమంలో అన్నదాన, హరితహార కార్యక్రమాలలో బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు నీలం మధు ముదిరాజ్ పాల్గొన్నారు. మంత్రి కేటీఆర్ జన్మదినం పురస్కరించుకొని చిట్కుల్ గ్రామంలోని స్వయంభు వెలసిన శ్రీ తుల్జాభవాని దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి చెట్లు నాటారు. అనంతరం ఇస్నాపూర్ చౌరస్తాలో అభిమానులు, బీఆర్ఎస్ కార్యకర్తల, ప్రజల సమక్షంలో ఘనంగా కేక్ కట్ చేసి సంబరాలు నిర్వహించారు. అనంతరం ఇస్నాపూర్ గ్రామంలో దివ్యాంగుల జీవనోపాధి కేంద్రాన్ని ప్రారంభించి ఇద్దరు దివ్యాంగులకు జీవనోపాధికి ఉపయోగపడేలా రెండు కుట్టు మిషన్లను నీలం మధు ముదిరాజ్ అందజేశారు. రాష్ట్ర ప్రభుత్వం ఆసరా పెన్షన్ పథకం కింద వికలాంగులకు 4,016 రూపాయిలు పెంచిన సందర్భంగా సీఎం కేసీఆర్ చిత్రపటానికి వికలాంగులతో కలిసి నీలం మధు పాలాభిషేకం చేశారు. ఇంద్రేశం గ్రామ శివారులో మదర్ తెరిసా వృద్ధాశ్రమంలో కేక్ కట్ చేసి సంబరాలు నిర్వహించారు. అనంతరం అన్నదానం కార్యక్రమం నిర్వహించారు. హరితహారం కార్యక్రమంలో భాగంగా మొక్కలు నాటారు. ఈ సందర్భంగా నీలం మధు ముదిరాజ్ మాట్లాడుతూ… రాష్ట్రానికి వేల కోట్లు పెట్టుబడి అందించే పరిశ్రమలు తీసుకురావడంలో మంత్రి కేటీఆర్ పాత్ర కీలకమని తెలిపారు. అలాగే తెలంగాణ ప్రజల సంక్షేమ పథకాల అమల్లో కూడా ఆయన ఎంతో కృషి చేస్తున్నారని అన్నారు. మరోపక్క రాష్ట్రంలో ఐటి పరిశ్రమల అభివృద్ధి కోసం కృషి చేస్తున్న ప్రజానేత కేటీఆర్ అని అన్నారు. ఇలాంటి నాయకుడికి పది కాలాలపాటు చల్లగా ఉండాలని, తెలంగాణ ప్రజలు ఆశీర్వచనం అందజేయాలన్నారు. దేశంలోనే తెలంగాణ రాష్ట్రంలో ఉన్నతంగా నిలపడంలో మంత్రి కేటీఆర్ చేస్తున్న కృషి మర్చిపోలేమని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమాల్లో పార్టీ కార్యకర్తలు, అభిమానులు, ప్రజలు, ఎన్ఎంఆర్ యువసేన సభ్యులు, తదితరులు పాల్గొన్నారు.




