నీలం మధుకు బ్రహ్మరథం పట్టిన పాశ మైలారం గ్రామ ప్రజలు

పటాన్ చెరు,ప్రజాతంత్ర, నవంబర్ 21: పటాన్ చెరు నియోజకవర్గ బీఎస్పి పార్టీ అభ్యర్థి నీలం మధు ముదిరాజ్ కి బ్రహ్మ రథం పట్టిన పాశ మైలారం గ్రామ ప్రజలు పటాన్ చెరు నియోజకవర్గ బీఎస్పి  పార్టీ అభ్యర్థి నీలం మధు ముదిరాజ్  ప్రచారంలో భాగంగా పాశ మైలారం గ్రామంలో గ్రామ ప్రజలతో పాటు పలు దేవాలయాలు దర్శించుకొని అనంతరం రోడ్ షో నిర్వహించారు. ఈ సందర్భం గా నీలం మధు ముదిరాజ్  మాట్లాడుతూ… గ్రామంలో ఉన్న నీటి సమస్య,కరెంటు సమస్య,విద్యార్థులకి బస్సు సమస్య ఉందని తెలిపారు. గెలిచిన వెంటనే అన్ని పరిష్కరిస్తా అని ప్రతి ఒక్కరు ఏనుగు గుర్తుకు ఓటు వేయాలని తెలిపారు. ప్రజలంతా నీలం మధు ముదిరాజ్ మా ఇంటి బిడ్డ అని మా బిడ్డని మేము భారీ మెజారిటీతో గెలిపిస్తామని తెలిపారు.ఈ కార్యక్రమంలో బీఎస్పి  పార్టీ నాయకులు, ఎన్ఏంఆర్ యువసేన సభ్యులు, నీలం మధు అభిమానులు భారీ ఎత్తున పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *