నీలం మధుకు ప్రజలు నిరాజనం

పటాన్ చెరు,ప్రజాతంత్ర, నవంబర్ 25: పటాన్ చెరు నియోజకవర్గం బీఎస్పీ పార్టీ అభ్యర్థి నీలం మధు ముదిరాజ్  ఐలాపురం, ఐలాపురం తండా, నర్రిగూడెం లో జరిగిన ప్రచారంలో పాల్గొన్నారు.పటాన్ చెరు నియోజకవర్గ బీఎస్పి పార్టీ అభ్యర్థి నీలం మధు ముదిరాజ్  ప్రచారంలో భాగంగా ఐలాపురం, ఐలాపురం తండా, నర్రిగూడెం లో రోడ్ షో నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామానికి చెందిన యువత, మహిళలు, ప్రజలు భారీ ఎత్తున్న స్వాగతం పలికారు.ఈ సందర్భంగా నీలం మధు మాట్లాడుతూ.పటాన్ చెరు నియోజకవర్గం అభివృద్ధి కోసం ప్రవేశ పెట్టిన నీలం మధు పది భరోసాలతో అన్ని వర్గాల ప్రజల  అభివృధి తో పాటు మన నియోజకవర్గంని దేశానికే రోల్ మోడల్ గా తీర్చిదిద్దుతా అని తెలిపారు. ఈ నెల 30వ తేదీన జరిగే ఎన్నికల్లో ప్రతి ఒక్కరు ఏనుగు గుర్తుకు ఓటు వేసి మీ బిడ్డని ఆశీర్వదించాలని అన్నారు.ఈ కార్యక్రమంలో బీఎస్పి  పార్టీ నాయకులు, ఎన్ఏంఆర్ యువసేన సభ్యులు, నీలం మధు ముదిరాజ్ అభిమానులు, భారీ ఎత్తున పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *