నిష్పక్షపాత సమాజం కోసం పిలుపు

మహిళా20 (డబ్ల్యూ20) చర్చల బృందం
జి20 భారత్‌: ‌మహిళలకు సమాన అవకాశాల..

– డాక్టర్‌ ‌సంధ్య పురేచా, డబ్ల్యూ20 చైర్‌ ‌పర్సన్‌
– ‌ధరిత్రి పట్నాయక్‌, ‌డబ్ల్యూ20 సచివాలయ ముఖ్య సమన్వయకర్త

మహిళా20 (డబ్ల్యూ20) అన్నది 2015లో జి20కి టర్కీ అధ్యక్ష బాధ్యతలు నిర్వహించిన  సమయంలో ఏర్పాటు చేయబడిన అధికారిక చర్చల బృందం. లింగ ప్రాముఖ్యంగల అంశాలను జి20 చర్చల ప్రధాన స్రవంతిలో చేర్చడం ఈ బృందం ఏర్పాటులో ప్రధానోద్దేశం. దీంతోపాటు మహిళల ఆర్థిక సాధికారతసహా లింగ సమానత్వం, మహిళల ప్రోత్సాహక విధానాలు, వాగ్దానాలను జి20 అధినేతల సంయుక్త ప్రకటనలో భాగంగా రూపొందించడం దీని లక్ష్యం.

దేశ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ సమర్థ నాయకత్వాన మహిళలకు సానుకూల వాతావరణ సృష్టిలో భారతదేశం గణనీయ ప్రగతి సాధించింది. ఈ నేపథ్యంలో జి20కి భారత్‌ అధ్యక్షత ‘‘సార్వజనీనంగా, ఆకాంక్షభరితంగా, నిర్ణయాత్మకంగా, కార్యాచరణ ఆధారితం’’గా ఉండాలన్న  ప్రధానమంత్రి దార్శనికతను డబ్ల్యూ20 ముందుకు తీసుకెళ్లడానికి కృషి చేస్తుంది. ప్రధానమంత్రి నిర్దేశించిన మేరకు రాబోయే ఏడాది కాలంలో కొత్త ఆలోచనలను, సమష్టి కార్యాచరణను వేగిరపరచేందుకు జి20 ప్రపంచ ‘స్ఫూర్తిదాత’గా పనిచేసేలా భారత్‌ ‌కృషి చేస్తుంది. ఇక ప్రతి మహిళ ఆత్మగౌరవంతో జీవించేలా సమాన అవకాశాలుగల, నిష్పక్షపాత ప్రపంచ సృష్టిపై భారత డబ్ల్యూ20 ప్రధానంగా దృష్టి సారిస్తుంది. ఈ లక్ష్య సాధనలో భాగంగా మహిళా చోదిత ప్రగతికి ఎదురయ్యే అన్ని అవరోధాలనూ తొలగించడం, మహిళల ప్రగతికి, పరివర్తనకు, వారి జీవితాలతోపాటు ఇతరుల జీవితాలను మార్చడానికి వీలు కల్పించే పరిస్థితులు, పర్యావరణ వ్యవస్థ సృష్టికి డబ్ల్యూ20 భరోసా ఇస్తుంది.

ఆచరణాత్మక, ప్రభావశీల సందేశాల రూపకల్పన దిశగా భాగస్వామ్య బృందాలతో సార్వజనీన సంప్రదింపులకు ఈ చర్చల బృందం సౌలభ్యం కల్పిస్తుంది. అంతేకాకుండా విభిన్న, వివిధ రంగాల అంతర్గత ప్రయోజనాల సంపూర్ణ ప్రాతినిధ్య అవసరాన్ని ముందుగా గుర్తించి, జి20 చర్చలకు- అంతిమంగా జి20 దేశాధినేతల సంయుక్త ప్రకటనకు తగిన సిఫారసులతో నేపథ్యాన్ని సిద్ధం చేస్తుంది. అలాగే కీలకమైన మహిళా సమస్యలపై ఏకాభిప్రాయ సాధన, మహిళా పారిశ్రామికవేత్తలతో జి20 చురుకైన చర్చల కొనసాగింపు, లింగ సమానత్వం  పెంపొందించే విధానాల సంబంధిత కట్టుబాట్లకు ప్రాధాన్యం తదితరాలకూ ప్రాముఖ్యం ఇవ్వడం మన బాధ్యతలలో ఒకటి. ఈ నేపథ్యంలో ఏటా మారుతుండే  అధ్యక్ష బాధ్యతల మధ్య బలమైన జాతీయ, అంతర్జాతీయ డబ్ల్యూ20 నెట్‌వర్క్ ఏర్పాటుకు ఒక బృందంగా కృషి చేయడం ద్వారా డబ్ల్యూ20 కార్యక్రమాల కొనసాగింపుపై భరోసా ఇచ్చేందుకు యత్నిస్తాం.

జి20కి భారత్‌ అధ్యక్ష బాధ్యతలలో భాగంగా డబ్ల్యూ20 దృష్టిసారించే నాలుగు ప్రాధాన్యాంశాలివే :
1.అట్టడుగు స్థాయినుంచి మహిళా నాయకత్వ నిర్మాణం
2.మహిళా వ్యవస్థాపకత
3.లింగపరమైన డిజిటల్‌ అం‌తరం తొలగింపు
4.విద్య, నైపుణ్యాభివృద్ధితో ముందంజకు బాటలు వేయడం

ఈ ప్రాధాన్యాలను ప్రముఖ స్థానంలో ఉంచే దిశగా డబ్ల్యూ20 బృందం ‘‘సమీకృతం.. సహకారం.. సమాచారం-ఏకాభిప్రాయ సాధన, కార్యాచరణకు పిలుపు’’ అనే ‘4సి’ విధానాన్ని అనుసరిస్తుంది. ఈ మేరకు మేము మహిళా సమస్యలకు సంబంధించిన వివిధ భాగస్వాములను ఇందులో చేర్చుకోవడంతోపాటు వారికొక పాత్ర కల్పించి, మమేకమయ్యేలా  చేస్తాం :

భాగస్వాములు :  అట్టడుగు స్థాయిలో ఉన్నవారే మా ప్రాథమిక భాగస్వాములు.. వీరిలో గ్రామీణ-పట్టణ, గిరిజన ప్రాంతాల మహిళలుసహా వ్యవసాయ, అసంఘటిత రంగ కార్మికులు, మహిళా కళాకారులు, చేనేత-హస్తకళ పనుల్లోగల మహిళలు, మహిళా పారిశ్రామికవేత్తలు, అంగన్‌వాడీ కార్యకర్తలు, పీఆర్‌ఐలు తదితరులున్నారు. విద్యార్థులకు అవగాహన కార్యక్రమాల కోసం డబ్ల్యూ20 ఉన్నత విద్య, పరిశోధన సంస్థలతో సంయుక్తంగా పనిచేస్తుంది. దీంతోపాటు శ్వేతపత్రాలు, విధాన వివరణలు, పరిశోధన పత్రాల వంటి విజ్ఞాన ఉత్పత్తులను రూపొందిస్తుంది. జాతీయ, అంతర్జాతీయ మహిళా పౌర సమాజ వేదికలు, స్థానిక స్వచ్ఛంద సంస్థలతోపాటు ఐక్యరాజ్యసమితి, అంతర్జాతీయ కార్మిక సంస్థ, చాంబర్‌ ఆఫ్‌ ‌కామర్స్ ‌సంస్థలు వగైరాలు కూడా ఈ కృషిలో పాలుపంచుకుంటాయి. ఈ భాగస్వాములందరి కలయికతో డబ్ల్యూ20 ఒక విభిన్న చర్చా వేదికగా రూపొందుతుంది.

ప్రజా ఉద్యమం-జన చైతన్యం (గల్లీనుంచి దిల్లీదాకా) : రాజధాని నుంచి గ్రామీణ ప్రాంతాల దాకా నిర్వహించే సమావేశాలు, కార్యక్రమాల ద్వారా అన్నివర్గాల మహిళల భాగస్వామ్యానికి డబ్ల్యూ20 కృషిచేస్తుంది. అలాగే డబ్ల్యూ20పై అవగాహన కల్పన, చర్చల బృందం విధానాలపై సంక్షిప్త సమీక్ష, సందేశాలలో పౌరుల గళం వినిపించేలా గ్రామచావడి సభలు నిర్వహించబడతాయి. గ్రామీణస్థాయిలో తగు వాతావరణం ఏర్పడే విధంగా తీర్మానాల ఆమోదం లక్ష్యంగా గ్రామసభ స్థాయి సమావేశాలు కూడా ఏర్పాటు చేయబడతాయి. అలాగే డబ్ల్యూ20 ప్రాధాన్యాంశాలకు మద్దతుగా దేశవ్యాప్త పోస్ట్‌కార్డ్ ‌కార్యక్రమం చేపట్టబడుతుంది. ఇది విధాన రూపకర్తలతోపాటు విధాన ఫలితాలను కూడా ప్రభావితం చేస్తుంది. మరోవైపు భారతదేశ ఉజ్వల సంస్కృతి-వారసత్వాన్ని ప్రస్ఫుటం చేస్తూ అంతర్జాతీయ ప్రతినిధులతో నాలుగు భారీ ప్రపంచస్థాయి కార్యక్రమాలు నిర్వహించబడతాయి. వీటిలో శాస్త్రీయ నృత్యాల ప్రదర్శనలతోపాటు నానో వ్యాపారవేత్తల, స్థానిక వంటకాలతో కూడిన చేనేత-హస్తకళల మేళా ఉంటుంది. కాగా, తొలి సమావేశం 2023 ఫిబ్రవరి 13-15 తేదీలలో ఔరంగాబాద్‌లో జరుగుతుంది.

మహిళా వ్యవస్థాపకత : డబ్ల్యూ20 కార్యక్రమం మహిళా వ్యవస్థాపకతసహా సత్ఫలితాలిచ్చే పనికిగల ప్రాముఖ్యాన్ని గుర్తిస్తుంది. దీనికి సంబంధించి ముఖ్యంగా సుస్థిర ప్రగతి లక్ష్యాల్లో (ఎస్డీజీ) 8.3 ఇలా పేర్కొంటోంది- ‘‘ఉత్పాదక కార్యకలాపాలు, మంచి ఉద్యోగాల సృష్టి, వ్యవస్థాపకత, సృజనాత్మకత, ఆవిష్కరణలకు మద్దతిచ్చే ప్రగతి-ఆధారిత విధానాలను ప్రోత్సహించాలి. అలాగే అధికారికీకరణను, ఆర్థిక సేవల సౌలభ్యం ద్వారా సూక్ష్మ-చిన్న-మధ్య తరహా సంస్థల వృద్ధిని ప్రోత్సహించాలి.’’ ఇందులో భాగంగా వ్యవస్థాపకులు, అంకుర సంస్థలు, యూనికార్న్‌లు, నానో-సూక్ష్మ వ్యాపారవేత్తలతో చర్చలు, సంప్రదింపుల నిర్వహణసహా ఆయా వర్గాల సిఫారసులకు ప్రాధాన్యమిస్తుంది.

అంతర్జాతీ ఏకాభిప్రాయ సాధన : పెట్టుబడికి సంబంధించి మహిళల ఆర్థిక సాధికారత అన్నది ప్రపంచంలో అత్యంత ఆశాజనకమైనది. అతిపెద్ద వర్ధమాన మార్కెట్లు, మేధో సమూహాలు, జనశక్తి లబ్ధి వగైరాలను సద్వినియోగం చేసుకోవచ్చు. సుపరిపాలన, ఆర్థిక వృద్ధి, పేదరికం- ఆకలి నిర్మూలన, అందరికీ ఆహార భద్రత-పోషకాహారం, సుస్థిర వినియోగం-ఉత్పత్తి విధానాలు, పర్యావరణ సుస్థిరతసహా మొత్తం ‘ఎస్డీజీ’ల సాధనకు ప్రాధాన్యంతో మహిళా ఆర్థిక సాధికారతపై ప్రపంచ ఏకాభిప్రాయ సాధనకు డబ్ల్యూ20 కృషి చేస్తుంది. మరోవైపు వ్యాపారం, ప్రభుత్వం, మహిళలు, పౌర సమాజంసహా భాగస్వాములందరికీ బహిరంగ పిలుపు రూపేణా డబ్ల్యూ20 కార్యక్రమం సమష్టి కృషి ప్రాధాన్యాన్ని తెలుపుతుంది. తద్వారా అట్టడుగు వర్గాలవారు సహా ఏ ఒక్కరినీ వెనుకన వదిలేయకుండా మహిళలందరూ ఆర్థిక వృద్ధి, ప్రగతి ప్రయోజనాలను పంచుకోవచ్చు. ఇక జి20, డబ్ల్యూ20ల త్రిసూత్రాలపై దృష్టిసారిస్తూ తన ప్రాధాన్యాలను, కృషినీ డబ్ల్యూ20 కచ్చితంగా కొనసాగిస్తుంది.

ఆదర్శప్రాయులు-మహిళా మార్గదర్శకులు : శాస్త్ర-సాంకేతిక, ఇంజినీరింగ్‌ ‌సహా మరెన్నో రంగాల్లో విజయాలకు మహిళలు ఎనలేని సహకారం అందించారు. ఈ మేరకు మహిళలు విజయం సాధించేదిశగా ప్రేరణనివ్వగల ఆదర్శప్రాయులను డబ్ల్యూ20 గుర్తిస్తుంది.

ప్రభుత్వ.. పౌరసమాజ పరివర్తన పథకాలు-పద్ధతులు : మహిళల అభ్యున్నతికి తోడ్పడిన పాలన నమూనాలను అర్థం చేసుకోవడానికి ప్రభుత్వ పథకాల విశ్లేషణ కూడా డబ్ల్యూ20 అగ్ర  ప్రాధాన్యాల్లో ఒకటి. ఉదాహరణకు- ప్రభుత్వం, పౌర సమాజం ద్వారా మంచి పద్ధతుల అనుసరణకు మధ్యప్రదేశ్‌లో అమలు చేస్తున్న ‘లాడ్లీ లక్ష్మీ యోజన’ వంటిదాన్ని ఒక ఉదంతంగా స్వీకరించవచ్చు.  డాక్టర్‌ ‌సంధ్య పురేచా డబ్ల్యూ20 చర్చా బృందానికి చైర్‌ ‌పర్సన్‌ ‌గా వ్యవహరిస్తున్నారు. అలాగే భారత ప్రతినిధులు/భాగస్వాములలో డాక్టర్‌ ‌జ్యోతి కిరణ్‌ ‌శుక్లా, ప్రొఫెసర్‌ ‌షమికా రవి, శ్రీమతి భారతి ఘోష్‌, ‌రవీనా టాండన్‌ ‌వంటి ప్రముఖులు సభ్యులు కాగా, ధరిత్రి పట్నాయక్‌ (‌ఫిక్కి ఫ్లో) డబ్ల్యూ20 సచివాలయ ముఖ్య సమన్వయకర్తగా ఉన్నారు. ఇక డబ్ల్యూ20 చర్చల బృందానికి ‘అమూల్‌’ ‌సంస్థ సంస్థాగత భాగస్వామిగా వ్యవహరిస్తుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *