నిర్మాణ రంగా కార్మికుల వైద్య పరీక్ష రిపోర్టులను అందజేసిన కార్పొరేటర్ దొడ్ల వెంకటేష్ గౌడ్

శేరిలింగంపల్లి,ప్రజాతంత్ర , ఆగస్ట్ 30 : శేరిలింగంపల్లి నియోజకవర్గం ఆల్విన్ కాలనీ డివిజన్ కార్పొరేటర్ దొడ్ల వెంకటేష్ గౌడ్ బుధవారం నిర్మాణ రంగ కార్మికులకు వైద్యపరీక్షల రిపోర్టులను అందజేశారు. ఈ మేరకు ఆయనతెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ భవన మరియు ఇతర నిర్మాణ రంగ కార్మికుల కోసం నిర్వహిస్తున్న సంపూర్ణ ఆరోగ్య పరీక్షల శిభిరాన్ని 124 డివిజన్ పరిధిలోని పిజెఆర్ నగర్ కాలనీ కమిటీ హల్ లో ఏర్పాటుచేసి నిర్మాణ కార్మికులకు ఉచితంగా ఆరోగ్య పరిక్షలు చేస్తున్న సందర్భంగా   ముఖ్య అతిధిగా హాజరై నిర్మాణ రంగ కార్మికులకు వైద్య పరీక్షల రిపోర్టులను అందించడం జరిగింది. కార్యక్రమంలో డివిజన్ అధ్యక్షులు సమ్మారెడ్డి, ఎస్టీ సెల్ అధ్యక్షులు జాన్, వాసుదేవరావు, పోశెట్టిగౌడ్, బాలస్వామి, ముజీబ్, మౌలానా, బాబునాయక్, రవీందర్, సాయిగౌడ్, పుట్టం దేవి, వెంకటలక్ష్మి, రేణుక, సురేఖ, తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *