నిర్మాణంలో ఉన్న ఓ భవనం పై నుంచి పడి ఇద్దరు కార్మికుల మృతి.. ముగ్గురికి గాయాలు 

శేరిలింగంపల్లి,ప్రజాతంత్ర,సెప్టెంబర్ 7: శేరిలింగంపల్లి నియోజక వర్గం కూకట్ పల్లి సర్కిల్ హైదర్ నగర్ డివిజన్ కేపిహెచ్ బీ పోలీస్ స్టేషన్ పరిధిలోని అడ్డగుట్ట సొసైటీ కాలనీలో నిర్మాణంలో ఉన్న ఓ భవనం పై నుంచి ఐదుగురు కార్మికులు ప్రమాదవశాత్తు కింద పడ్డారు వారిలో ఇద్దరు మృతి చెందగా మరో ముగ్గురు తీవ్ర గాయాలతో దగ్గర్లో ఉన్న ప్రతిమ హాస్పిటల్ లో చికిత్స పొందుతున్నారు. భవనం లోని ఆరవ అంతస్తు పిట్టగోడ నిర్మాణ పనులు కొనసాగుతుండగా ప్రమాదం జరిగింది.పిట్టగోడతోపాటు గోవా కర్రలు కూడా విరిగి కార్మికులు కింద పడిపోయారు.మృతి చెందిన కార్మికులు ఒరిస్సాకు  చెందిన సోనియా సింగ్ సంతోష్ లుగా గుర్తించారు. గాయపడ్డ ముగ్గురికార్మికుల పరిస్థితి విషమంగా ఉంది. ఆసుపత్రిలో చేర్పించిన అనంతరం ఒకరు మృతి చెందినట్లు సమాచారం. గాయపడ్డ కార్మికుల వివరాలు తెలియాల్సి ఉంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *