నిర్ణయం నువ్వే తీసుకో…

ఆధిపత్యాల పోరు అంతం కాదా
యుద్ధం కూటముల కుట్రల పంతం కాదా!

తను పట్టిన కుందేలుకు ఇంకా
మూడు కాళ్లేనా

హిట్లర్‌,‌ముసోలిన్‌ ‌సరసన పుతిన్‌
‌తిరగబడి ఎగబడదా ఉక్రెయిన్‌!

‌సమత, సామ్యవాదాల రష్యా!

మర ఫిరంగుల అగ్ని వర్షాలు
అమాయక ప్రాణుల రక్తపాతాలు!

సమరంలో సామాన్యులు సమిధ లై
పోరాదు
శాంతి కపోతాల రెక్కలు తెగి పోరాదు

సప్త ఖండాలు ముక్త కంఠంతో
ఖండిస్తున్నా యి
విధ్వంస దౌర్జన్య ధ్వంస రచనలను
గర్హిస్తున్నాయి

యుద్ధం మొదలు పెట్టినాక

వెనుకకు పో వద్దనేది మరువు
నిలుస్తుందేమో ప్రపంచం శాంతి పరువు

నిర్ణయం నువ్వే తీసుకో రష్యా!

  – పి.బక్కారెడ్డి
                               9705315250

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *