నిరుపేద విద్యార్థి ఉన్నత చదువు కోసం ఉప్పల ట్రస్టు చేయూత

ఆమనగల్లు, ప్రజాతంత్ర జులై 18 : రంగారెడ్డి జిల్లా మాడుగుల మండలం అప్ప రెడ్డిపల్లి గ్రామానికి చెందిన శీలం ముత్యాలు కూతురు, విద్యార్థిని సరిత ఆర్థిక ఇబ్బందుల దృశ్య ఉన్నత చదువు కోసం ఉప్పల చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ తలకొండపల్లి జెడ్పిటిసి ఉప్పల వెంకటేస్ ఆర్థిక సాయం చేసి చేయూత అందించారు. ఉప్పల చారిటబుల్ ట్రస్ట్ ద్వారా అమ్మాయి ఉన్నత చదువు కోసం రూ.15 వేల చెక్కు తన కుమారుడు డాక్టర్. ఉప్పల అఖిల్ ద్వారా సరితకు అందజేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు వడ్డేమోని శేఖర్, విజేందర్, పవర్, కొత్త భాస్కర్ గౌడ్, తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *