ఆమనగల్లు, ప్రజాతంత్ర ఆగస్టు 4 : కల్వకుర్తి నియోజకవర్గంలోని నిరుపేదల అసంపూర్తి ఇండ్ల నిర్మాణానికి ఉప్పల చారిటబుల్ ట్రస్ట్ చేయితనందిస్తుంది. ఇందులో భాగంగా మార్చాల గ్రామంలో మెడికల్ క్యాంప్ ఏర్పాటు చేసి ఉచితంగా మందులను పంపిణీ చేశారు. ఉప్పల చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్, తలకొండపల్లి మండల జెడ్పిటిసి వెంకటేష్ సురేష్ మోడీ పర్యవేక్షణ లో పది అసంపూర్తి ఇండ్ల నిర్మాణం లో భాగగా మొదట ఆరు ఇండ్లకు ఉప్పల చారిటబుల్ ట్రస్ట్ తలకొండపల్లి జడ్పీటీసీ ఉప్పల వెంకటేష్ ట్రస్టు ద్వారా మార్చాల గ్రామంలో నిరుపేద ఆరు కుటుంబాలకు (1) గంజి పెంటయ్య (2) శానామోని కృష్ణయ్య (3) గంజి లక్ష్మయ్య( 4) నాకిరామోని సుల్తాన్ (5) కడమంచి నిరంజన్ (6) యం డి. మొలనాభి లకు చెందిన ఇల్లు నిర్మాణానికి కావలసిన మెటీరియల్ ఇటుక, ఇసుక, డస్ట్, సిమెంటు అమరబాదమోడీ సురేష్ ద్వారా ఇప్పించారు. ఈ కార్యక్రమం బాలకిష్టయ్య గౌడ్, మోటాపురం రాములు, బ్యాగరి మల్లయ్య, గుండె లింగమయ్య గౌడ్ తదితరులు పాల్గొన్నారు.


