నిరుపేదలకు అండ లయన్స్ క్లబ్ ఆఫ్ ఆమనగల్లు

ఆమనగల్లు, ప్రజాతంత్ర అక్టోబర్ 21 :  తెలంగాణ రాష్ట్ర మల్టిపుల్ 320 లోని జిల్లా 320ఎ లోనే అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఉచిత సంచార భోజన అన్నదాన శిబిరాన్ని ఆమనగల్లుకు చెందిన ప్రముఖ వైద్యులు దివంగత జూలూరు పర్వతాలు జ్ఞాపకార్థం ఆయన 22వ వర్ధంతి సందర్భంగా ఆమనగల్లు బస్టాండ్ ఎదురుగా ఉన్న రవీంద్ర మెడికల్ హాల్ ఆవరణలో వారి మనవరాలు జూలూరు శృతి, ప్రితి ఆయన కుమారుడైన జూలూరి రవీంద్రనాథ్ తో కలిసి ప్రారంభించారు. ఆకలి ఉన్నవారికి ఆకలి తీర్చడం నిరుపేదలకు సేవలు అందించడం లయన్స్ క్లబ్ లక్ష్యమని లయన్స్ క్లబ్ సభ్యులు అన్నారు. జూలూరి పర్వతాలు సేవలను లయన్స్ క్లబ్ సభ్యులు కొనియాడారు. లయన్స్ క్లబ్ సభ్యులే కాకుండా వేరే సొసైటీ సభ్యులు ఎవరైనా జన్మదినాలు, పెళ్లిరోజులు, వర్ధంతులకు లయన్స్ క్లబ్ సభ్యులను సంప్రదిస్తే వారి సహకారం ఉంటుందనీ జూలూరి రమేష్, కార్యదర్శి గోవర్ధన్ రెడ్డి తెలిపారు. ఈ  శిబిరంలో సుమారు 450 మందికి అన్నదానం చేసినట్లు క్లబ్ పిఆర్ఓ పాషా తెలిపారు. ఈ కార్యక్రమంలో లయన్స్ క్లబ్ జిల్లా చైర్మన్ జూలూరి రమేష్, కార్యదర్శి గోవర్ధన్ రెడ్డి, కోశాధికారి కొరివి వెంకటయ్య, సంయుక్త కార్యదర్శి ఎంగలి బాలకృష్ణ, లయన్స్ క్లబ్ సభ్యులు పాపిశెట్టి రాము, ఏలే శివకుమార్, కర్నాటి కొండల్ రెడ్డి, సుధీర్ రెడ్డి, మధుసూదన్ రెడ్డి, పిఆర్ఓ పాషా, మరియు పర్వతాలు, కుటుంబ సభ్యులు జూలూరి రవీంద్రనాథ్, ప్రభావతి, పద్మ, శృతి, ప్రీతి, తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *