నిరుపేదలకు అండగా బిఆర్ఎస్ ప్రభుత్వం.

శేర్లింగంపల్లి, ప్రజాతంత్ర, ఆగస్టు 2: నిరుపేదలకు అండగా బి ఆర్ ఎస్ ప్రభుత్వం పనిచేస్తుందని ప్రభుత్వ విప్ శేరిలింగంపల్లి ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీ అన్నారు. ఈ మేరకు ఆయన బుధవారం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పేద, మధ్య తరగతి కుటుంబాలకు వారు నివసిస్తున్న ప్రాంతంలో ఆస్తి హక్కులను కల్పించడానికి జీవో నెంబర్  . 58 & 59 ద్వారా అవకాశం కల్పించగా దానిలో భాగంగా శేరిలింగంపల్లి నియోజకవర్గంలో కూకట్పల్లి మండలంలో కూకట్పల్లి డివిజన్ పరిధిలోని లోని పాపిరెడ్డినగర్ కాలనీ లో దరఖాస్తు చేసుకున్న వారికి జీవో నెంబర్ 59 ద్వారా యజమాని హక్కుల ను కలిపిస్తూ అర్హులైన 22 మంది లబ్ధిదారులకు  కార్పొరేటర్లు దొడ్ల వెంకటేష్ గౌడ్ గారు, నార్నె శ్రీనివాసరావు ,  ఉప్పలపాటి శ్రీకాంత్ ,  మాజీ కార్పొరేటర్ మాధవరం రంగరావు ల తో కలిసి అంద చేశారు. ఈ సందర్భంగా ప్రభుత్వ విప్ గాంధీ గ మాట్లాడుతూ నిరుపేదలకు అండగా ఉండేది ముఖ్యమంత్రి కేసీఆర్ అని.. దశాబ్దాలుగా నివాసం ఉంటున్న నిరుపేదలకు జీవో నెంబర్ 58 ప్రకారం వారికి రెగ్యులరైజ్ చేసి జీవితంపై భరోసా కల్పించిన గొప్ప దార్శనికుడు కొనియాడారు. అదేవిధంగా 59 జి.ఓ కింద ప్రభుత్వం నిర్ణయించిన డబ్బులు చెల్లించి రిజిస్ట్రేషన్ చేయించుకుని ప్రభుత్వం కల్పించిన 5 శాతం రాయితీని సైతం పొందారు.  ఎంతో కాలంగా అపరిష్కృతంగా ఉన్న స్థల వివాదాలు సమస్యలో పేద మధ్య తరగతి కుటుంబాలు మరియు నివసిస్తున్న స్థలాలకు కూడా యాజమాన్య హక్కు లేకపోవడం ద్వారా పడుతున్న ఇబ్బందులను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గుర్తించి ప్రత్యేక జీవో ద్వారా  రెగ్యులరైజ్ చేసుకునే   గొప్ప  అవకాశం కలిపించింది అని ఈ అవకాశాన్ని వినియోగించుకుంటూ తెలంగాణ రాష్ట్ర పేద మధ్య తరగతి కుటుంబాలలో కనిపిస్తున్నా సంతోషం మాటలో చెప్పలేనిదని తెలియజేసారు. సంక్షేమం అంటే ప్రభుత్వం ఇచ్చే పథకాల సంఖ్య కాదు పేద కుటుంబాలలో కనిపించే ఆనందం అని,  తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించిన నాటి నుంచి నేటి వరుకు తెలంగాణ ప్రజల జీవన విధానంలో మెరుగైన జీవనాన్ని అందించడానికి చేపడుతున్న పథకాలు  దేశానికే ఆదర్శం అని ప్రభుత్వ విప్ గాంధీ  తెలియజేసారు.  ఈ  కార్యక్రమంలో వివేకానంద నగర్ డివిజన్ బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు సంజీవ రెడ్డి, బీఆర్ఎస్ పార్టీ నాయకులు చంద్రారెడ్డి , కాశినాథ్ యాదవ్ ,గుడ్ల శ్రీనివాస్, ఆర్ భగవంతు రెడ్డి, నరసింహులు ముదిరాజ్, సిహెచ్ రామకృష్ణారెడ్డి, ఎం కనక రెడ్డి, వీరభాస్కర్, శ్రీనివాస్, ప్రేమ్ కుమార్, శ్రీహరి, మోహన్ , V. ఆంజనేయులు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *