నిరుద్యోగ భృతి ఇచ్చి నిరుద్యోగులను ఆదుకోవాలి

ఆమనగల్లు, ప్రజాతంత్ర ఆగస్ట్ 10 : తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఎన్నికల మేనిఫెస్టోలో పొందుపరిచిన విధంగా చదువుకున్న నిరుద్యోగ యువతీ యువకులకు నిరుద్యోగ భృతి అందించి ఆదుకోవాలని  టీపీసీసీ సభ్యులు ఆయిళ్ళ శ్రీనివాస్ గౌడ్ అన్నారు.  గురువారం కడ్తాల్ మండల కేంద్రంలో బజ్జ శ్రీను నాయక్ కు సంబందించిన ఎస్ ఎస్ కమ్యూనికేషన్ సెంటర్ ను స్థానిక నాయకులతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్బంగా టీపీసీసీ సభ్యులు శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ ప్రభుత్వ్యం యువకులకు వివిధ రంగాల్లో నైపుణ్య శిక్షణ ఇచ్చి వారికి గతం లో ఎన్నికల సమయం లో ఇచ్చిన హామీ మేరకు నిరుద్యోగ భృతి నెలకు రూ. 3వేల చొప్పున ప్రతి నెల అందించాలని డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో జడ్పిటిసి దశరథ్ నాయక్, సర్పంచ్ లక్ష్మి నర్సింహా రెడ్డి, ఎంపీటీసీ గూడూరు శ్రీనివాస్ రెడ్డి, బ్లాక్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ యాట నర్సింహా ముదిరాజ్, జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు ప్రధాన కార్యదర్శి భీక్య నాయక్, కాంగ్రెస్ మండల పార్టీ అధ్యక్షులు బిచ్య నాయక్ బిఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షులు పరమేష్, సర్పంచులు శంకర్, ఆనంద్, రాము నాయక్, పాండు, రామకృష్ణ, మంకి శ్రీను, కృష్ణా, బిక్షపతి, హనుమానాయక్, భాస్కర్ రెడ్డి మల్లేష్, హరి, నర్సింహా, ప్రవీణ్,తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *