నిరవధిక సమ్మెలోకి వెళ్లిన ఆశ వర్కర్లు

ఇబ్రహీంపట్నం,ప్రజాతంత్ర,సెప్టెంబర్ 25: రాష్ట్ర వ్యాప్తంగా సోమవారం ప్రారంభమైన ఆశా వర్కర్ల సమ్మెను మంచాల మండల కేంద్రంలో సీఐటీయూ ఆధ్వర్యంలో సమ్మె నిర్వహించారు.ఈసందర్భంగా సీఐటీయూ మండల కన్వీనర్ పోచమోని కృష్ణ పాల్గొని మాట్లాడుతూ,
ఆశ వర్కర్లకు ఇస్తున్న పారితోషికాలను 18 వేలకి పెంచి ఫిక్స్డ్ వేతనం అమలు చేయాలని డిమాండ్ చేశారు.కెసిఆర్ ప్రభుత్వము ఏర్పడి తొమ్మిదేళ్లు గడిచిన ఆశ వర్కర్లకు ఇప్పటికీ ఫిక్స్డ్ వేతనం అమలు చేయలేదని,ఆశ వర్కర్లకు ఇప్పుడు ఇస్తున్న పారితోషికాలను 18 వేలకు పెంచి ఫిక్స్ డ్ వేతనం నిర్ణయించాలని, పిఎఫ్,ఈఎస్ఐ సౌకర్యం,ఉద్యోగ భద్రత కల్పించాలని పేర్కొన్నారు.ప్రజల ఆరోగ్యాల కాపాడుతున్న ఆశా వర్కర్లకు హెల్త్ కార్డులు ఇవ్వాలని 5 లక్షల బీమా సౌకర్యం కల్పించాలని కోరారు. టిబి,లెప్రసీ,కంటి వెలుగు తదితర పెండింగ్ బిల్లులు వెంటనే చెల్లించాలని చెప్పారు.2021 జులై నుండి డిసెంబర్ వరకు 6 నెలల పిఆర్సి ఏరియార్స్ వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు.ఆశాలకు పనిభారం తగ్గించి జాబ్ చార్ట్ ను విడుదల చేయాలని 32 రకాల రిజిస్టర్స్ ను ప్రింట్ చేసి ప్రభుత్వం సప్లై చేయాలని ఆశాలకు ప్రసూతి సెలవుల పైన సర్కులర్ వెంటనే జారీ చేయాలని ఆయన డిమాండు చేశారు.ఈ కార్యక్రమంలో సీఐటీయూ జిల్లా నాయకులు గ్యర పాండు,ఆశ వర్కర్స్ యూనియన్ నాయకులు,ఆశా వర్కర్లు  అమృత,కవిత, నవనీత,రజిత,మంజుల తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *