నియోజకవర్గ బిఆర్ఎస్ కార్యదర్శిగా డిల్లి శ్రీధర్

కందుకూరు,ప్రజాతంత్ర,నవంబర్ 17 : విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి  చేతుల మీదుగా మహేశ్వరం నియోజకవర్గం కార్యదర్శిగా లేమూరు గ్రామానికి చెందిన డిల్లి శ్రీధర్ కి శుక్రవారం అధికారికంగా నియామక పత్రం అందజేశారు.ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ,నా పైన నమ్మకంతో పదవి ఇచ్చినందుకు సబితారెడ్డికి ఎల్లవేళలా ఋణ పడి ఉంటానని ఆమె గెలుపే లక్ష్యంగా పని చేస్తానని,భారీ మెజారిటీతో గెలవడం ఖాయమని ఈ సందర్బంగా తెలియజేశారు.ఈ కార్యక్రమంలో కందుకూరు మండల జడ్పీటీసీ బొక్క జంగారెడ్డి,మండల అధ్యక్షులు మన్నే జయందర్,మార్కెట్ కమిటీ చైర్మన్ సురసాని సురేందర్ రెడ్డి,పిఎసిఎస్ చైర్మన్ దేవరశెట్టి చంద్ర శేఖర్,నియోజకవర్గం ఉపాధ్యక్యులు గంగాపురం కిషన్ రెడ్డి,అనేగోని అంజయ్య గౌడ్,సొసైటీ వైస్ చైర్మన్ గోపిరెడ్డి విజేందర్ రెడ్డి,మండల వర్కింగ్ ప్రెసిడెంట్ ఎలుక మేఘనాథ్ రెడ్డి, నియోజకవర్గం ఎస్సీసెల్ ప్రెసిడెంట్ చిర్ర సాయిలు,సర్పంచ్ మంద సాయిలు,ఎంపిటిసి కాకి రాములు,కుమార్, రైతు విభాగం అధ్యక్షులు సోలిపేట అమరేందర్రెడ్డి,మార్కెట్ కమిటీ డైరెక్టర్ పొట్టి ఆనంద్,మాజీ సర్పంచ్ దేరంగుల జంగయ్య,సీనియర్ నాయకులు దేశం కృష్ణ రెడ్డి,గుల్వి జైపాల్,రాఘవేందర్ తదితరులు పాల్గొనడం జరిగింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *