న్యూ దిల్లీ, డిసెంబర్ 26 : కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అస్వస్థతకు గురయ్యారు. ఆమెను చికిత్స నిమిత్తం ఢిల్లీలోని ఎయిమ్స్ ఆస్పత్రికి తరలించారు. ఆస్పత్రిలోని ఓ ప్రైవేటు వార్డులో వైద్యులు ఆమెకు చికిత్స అందిస్తున్నారు. మధ్యాహ్నం 12 గంటల సమయంలో ఆమె ఆస్వస్థతకు గురైనట్లు తెలుస్తోంది.
ఆదివారం మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయి జయంతి సందర్భంగా.. ఢిల్లీలోని ’సదైవ్ అటల్’లో సీతారామన్ పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఇటీవల, తమిళనాడులోని ఒక విశ్వవిద్యాలయంలో జరిగిన కాన్వొకేషన్ వేడుకలోనూ ఆమె పాల్గొన్నారు. అయితే ఆమె రెగ్యులర్ చెకప్‌లకు వెళ్లారని కూడా అంటున్నారు. ఎలాంటి అస్వస్థత లేదన్నారు.



