నిమ్స్‌లో దేశంలోనే అతిపెద్ద డయాలసిస్‌ ‌సెంటర్‌…

  • 4000 ‌పడకలతో త్వరలో రికార్డ్
  • ‌కార్పొరేట్‌ ‌హాస్పిటల్స్‌తో పోటీ..
  • రాజ్యాంగ పదవుల్లో ఉన్నవారు హాఫ్‌ ‌నాలెడ్జ్‌తో వ్యాఖ్యలు చేయడం దురదృష్టకరం
  • రోబోటిక్‌ ‌సర్జరీ సిస్టమ్‌ను ప్రారంభించిన మంత్రి హరీష్‌ ‌రావు

హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, జూలై 3 : కార్పొరేట్‌ ‌హాస్పిటల్స్‌తో తెలంగాణ నిమ్స్ ‌పోటీ పడుతున్నదని, రాష్ట్ర ఏర్పాటు తర్వాత నిమ్స్ ఎం‌తో అభివృద్ధి చెందిందని రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి హరీష్‌ ‌రావు అన్నారు. ప్రభుత్వ రంగ హాస్పిటల్స్‌లో దేశంలోనే తొలిసారిగా నిమ్స్‌లో రూ.35 కోట్లతో ఏర్పాటు చేసిన రోబోటిక్‌ ‌సర్జరీ సిస్టమ్‌ను మంత్రి హరీష్‌ ‌రావు సోమవారం ప్రారంభించారు. ఈ సందర్బంగా మంత్రి హరీష్‌ ‌రావు మాట్లాడుతూ..సీఎం కేసీఆర్‌ 154 ‌కోట్లు కొత్త ఎక్విమెంట్‌ ‌కొనుగోలు కోసం గ్రాంట్‌గా అందించారనీ..అరోగ్య శ్రీ నుండి వొచ్చేవి ఇవ్వాలని చెప్పడం జరిగిందని పేర్కొన్నారు. 900 పడకల నుండి 1800 పడకలు పెంచాం.. సీఎం  4000 పడకల నిమ్స్ ‌హాస్పటల్‌ ‌కి శంకుస్థాపన చేశారని తెలిపారు. నిమ్స్ 4000 ‌పడకలతో దేశంలోనే పెద్ద హాస్పిటల్‌ ‌గా రికార్డు నెలకొల్పబోతున్నది..ఆల్‌ ఇం‌డియా టాప్‌ ‌ర్యాంకర్స్ ‌నిమ్స్‌లో చదివేందుకు ప్రాధాన్యం ఇస్తున్నారు..అని మంత్రి హరీష్‌ ‌రావు అన్నారు.

రాజ్యాంగ పదవుల్లో ఉన్నవాళ్లు కొన్ని సార్లు మాట్లాడుతున్నారు..హాఫ్‌ ‌నాలేడ్జ్‌తో కొందరు కామెంట్స్ ‌చేస్తున్నారు..కమిట్‌మెంట్‌ ‌లేకుంటే ఎందుకు ప్రభుత్వ హాస్పిటల్‌లో రోబో ఎక్విపెంట్‌ ఎం‌దుకు తెస్తాము..అని ప్రశ్నించారు. కోత తక్కువ కాబట్టి రోబో ద్వారా త్వరగా పేషెంట్లు కోలుకుంటారు..పేషంట్లు హాస్పిటల్‌లో ఉండాల్సిన సమయం తగ్గుతుంది..అని తెలిపారు. దేశంలోనే అతిపెద్ద డయాలసిస్‌ ‌సెంటర్‌ ‌నిమ్స్‌లో ఉందని తెలిపారు. తెలంగాణ రాకముందు నిమ్స్ అభివృద్ధి పై 50 ఏండ్లుగా ఎటువంటి శ్రద్ధ చూపలేదు..ఫాకల్టీ సంఖ్య 111 నుండి 264కు, వైద్య విద్యార్థుల సంఖ్య సంవత్సరానికి 82 నుండి 169 పెంచడం జరిగింది..నిమ్స్‌లో సేవలు గణనీయంగా పెరిగాయి. సంవత్సరానికి ఓపీ 5 లక్షల నుండి 6 లక్షలు, ఇన్‌ ‌పేషెంట్‌ల సంఖ్య 26 వేల నుండి 50 వేలు, సర్జరీలు 12 వేల నుండి 25 వేలు, డయాలిసిస్‌లు 12 వేల నుండి 72 వేలు, కిడ్నీ మార్పిడి ఆపరేషన్‌లు 25 నుండి 150కు పెరగడం జరిగింది..అని మంత్రి హరీష్‌ ‌రావు అన్నారు. నిమ్స్ ఏర్పడ్డప్పటి నుండి తెలంగాణ వొచ్చేంత వరకు అనగా 1989 నుండి 2014 వరకు 25 ఏండ్లలో చేసిన కిడ్నీ మార్పిడి సర్జరీలు 661 అయితే తెలంగాణ ఏర్పడ్డ తరవాత నుండి ఇప్పటివరకు 9 ఏండ్లలో చేసిన సర్జరీలు 753 అని, మూలుగు మార్పిడి సర్జరీలు 46 అయితే తెలంగాణ ఏర్పడ్డ తరవాత నుండి ఇప్పటివరకు 9 ఏండ్లలో చేసిన సర్జరీలు 154 జరిగాయని, మోకాలు మార్పిడి సర్జరీలు ఆ కాలంలో జరిగినవి 134 అయితే తెలంగాణ ఏర్పడ్డ తరవాత నుండి ఇప్పటివరకు 9 ఏండ్లలో చేసిన సర్జరీలు 1,444 అని వివరించారు. ఇప్పటికే నగరం నడిబొడ్డున ఉన్న అత్యంత విలువైన 32 ఎకరాల భూమిని నిమ్స్‌కు కేటాయించడం జరిగింది.. భవన నిర్మాణానికి 1,571 కోట్లకు పరిపాలన అనుమతులు ఇవ్వడం జరిగింది…అని హరీష్‌ ‌రావు తెలిపారు.

హాస్పిటల్‌ ‌భవనం 14 అంతస్థులతో, 24 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో నిర్మించబడుతుందని, ఓపీ పేషెంట్‌లకు, ఇన్‌పేషెంట్‌ ‌లకు మరియు ఎమర్జెన్సీ పేషెంట్‌ ‌లకు ప్రత్యేక బ్లాక్‌ల నిర్మాణం,  2 వేల పడకలలలో అన్నింటికీ ఆక్సిజన్‌ ‌సౌకర్యం ఏర్పాటు. 500 పడకలు ఐసీయూ కొరకు మరియు 300 పడకలు పేయింగ్‌ ‌రూమ్‌ ‌కొరకు  ఏర్పాటు, 38 ఆపరేషన్‌ ‌థియేటర్‌లు, డయాలిసిస్‌, ‌కాత్‌ ‌ల్యాబ్‌, ‌సిటీ స్కాన్‌, ఎంఆర్‌ఐ ‌వంటి అత్యాధునిక సౌకర్యాల ఏర్పాటు..వైద్య విద్య 14 స్పెషలిటీ, 23 సూపర్‌ ‌స్పెషలిటీ విభాగాలలో అందిచడం జరుగుతుందని మంత్రి ఈసందర్భంగా తెలిపారు. వైద్య విద్యతో పాటుగా స్పెషలిటీ నర్సింగ్‌ ‌మరియు స్పెషలిటీ అల్లైడ్‌ ‌హెల్త్(‌పారామెడికల్‌) ‌విద్య కూడా అందిస్తామని తెలిపారు. చెడు వినొద్దు, చెడు మాట్లాడొద్దు, చెడు మాట్లాడొద్దు అన్నారు. అయితే కొందరు మంచి చూడొద్దు, మంచి వినొద్దు, మంచి మాట్లాడొద్దు అన్నట్లు ఉన్నారని, ఈ అభివృద్ధి వారికి ఏనాడు కనిపించదని, ఒక్క ప్రశంస చేయరని, అలాంటి వారిని ఏమనాలని ప్రశ్నించారు. వైద్యులపై ప్రశంస చేయకుండా అభాండాలు వేయడం దురదృష్టకరమని మంత్రి హరీష్‌ ‌రావు ఆందోళన వ్యక్తం చేసారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *