నిబంధనలను అతిక్రమించి నూతన సంవత్సర వేడుకల్లో పాల్గొనవద్దు

వికారాబాద్ జిల్లా, ప్రజాతంత్ర, డిసెంబర్ 20: నూతన సంవత్సర వేడుకలకు సంబందించి పోలీస్ డిపార్ట్మెంట్ తరుపున కొన్ని సలహాలు సూచనలు ఇవ్వడం జరుగుతుంది. వాటిని ప్రతి ఒక్కరూ తప్పని సరిగా పాటించాలి జిల్లా ఎస్పీ కోటిరెడ్డి సూచించారు.
డి‌జే మరియు సౌండ్ బాక్స్ లకు, పెద్ద పెద్ద శబ్దాలకు  ఎలాంటి అనుమతులు లేవు అని పేర్కొన్నారు. రిసార్ట్ మరియు ఫామ్ హౌస్ లపై ప్రత్యేకమైన నిఘా వుంటుంది.రిసార్ట్ మరియు ఫార్మ్ హౌస్ లలో  ఎలాంటి ఆశీల్లత కార్యక్రమాలు జరపకూడదు అని అన్నారు.
మద్యం త్రాగి, రాష్ డ్రైవింగ్, ట్రిపుల్ రైడింగ్, చేసిన వాహన నియామ నిబందలను పాటించకుండా వాహనాలు నడిపిన వారిపై వాహనాలు సీజ్ చేసి చట్ట ప్రకారమైన చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలిపారు. 31 డిసెంబర్ అర్దరాత్రి సమయం లో నూతన సంవత్సరం వచ్చిన సంధార్బంగా ఎవ్వరూ కూడా ర్యాలీలు, బైక్ ర్యాలీలు ఎలాంటి అనుమతి లేదు అని పేర్కొన్నారు.
31 రాత్రి నుండి నూతన సంవత్సరం ఉదయం సమయం వరకు జిల్లా లో ప్రతి పోలీస్ స్టేషన్ పరిధిలో నాకాబందీ, వాహన తనికీలు  మరియు  డ్రంక్ & డ్రైవ్ టెస్ట్ లు వంటి పలు చర్యలు  నిర్వహించడం జరుగుతుంది అని అన్నారు.జిల్లా వ్యాప్తంగా పోలీస్ అధికారుల నిరంతరం పకడ్బందీ పెట్రోలింగ్ మరియు బందో బస్త్ లు ఏర్పాటు చేయడం జరుగుతుంది అని పేర్కొన్నారు.పోలీస్ అధికారులు పై తెలపబడిన విధులు నిర్వహించే సమయం ఎవరైనా ఇబ్బందులకు గురి చేస్తే అట్టి సంఘటనలను వీడియో లు చిత్రీకరించి కేసులు నమోదు చేయడం జరుగుతుంది అని అన్నారు.ఎవరైనా నూతన సంవత్సర వేడుకలు పెద్ద ఎత్తున్న చేస్తే వారు  పోలీస్ డిపార్ట్మెంట్ మరియు ఇతర శాఖల నుండి అనుమతులు తప్పనిసరిగా తీసుకొని వాటిని పాటించాలి. మరియు ప్రతీ ఈవెంట్ లో సీసీ కెమెరాలు తప్పనిసరి ఏర్పాటు చేసుకోవాలి అని పేర్కొన్నారు. ఈవెంట్స్ లో సెక్యూరిటీ తప్పనిసరి ఏర్పాటు చేసుకోవాలి అని అన్నారు. పార్కింగ్ ఇబ్బందులు లేకుండా చూసుకోవాలి సాధారణ పౌరులకు ట్రాఫిక్ సమస్య కల్పించొద్దు అని పేర్కొన్నారు. లిక్కర్ ఈవెంట్స్ లో మైనర్లకు అనుమతి లేదు మరియు న్యూఇయర్ వేడుకల్లో డ్రగ్స్ వాడితే కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుంది అని పేర్కొన్నారు.
న్యూఇయర్ వేడుకలకు రాత్రి 1  గంట వరకు ముగించాలి అని అన్నారు.
బహిరంగ ప్రదేశాలలో ఎవరైనా వేడుకలు జరుపుకొని గాని, వేడుకల పేరుతో ఇతరులకు ఇబ్బందులు గురిచేసిన యెడల అట్టి వారిపైన చర్యలు తీసుకోవడం జరుగుతుంది అని అన్నారు. పోలీసు శాఖ నుండి వెలువడిన సూచనలు సలహాలను  అతిక్రమించిన వారిపై ప్రజా భద్రత రీత్యా చట్టపరమైన చర్యలను తీసుకోవడము జరుగుతుంది అని ఎస్పీ కోటిరెడ్డి హెచ్చరికలు జారీ చేశారు .

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *