నిప్పుకు చెదలు పట్టదు జగ్గారెడ్డి కాంగ్రె స్ ను వదిలిపెట్టడు

చిన్నకోడూర్,ప్రజాతంత్ర, ఆగస్ట్ 21: సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డిని నేరుగా ఎదురుకోలేకనే చాటు మాటలతో జగ్గన్న ప్రతిష్టను దెబ్బతియ్యలని బిఆర్ఎస్  చూస్తున్నారని మత్య్సకారుల విభాగం రాష్ట్ర ఉపాధ్యక్షులు జంగిటి శ్రీనివాస్ ముదిరాజ్ మండిపడ్డారు.ఎన్నికలు దగ్గర పడుతుండటంతో మచ్చ లేని జగ్గారెడ్డిమీద తప్పుడు ప్రచారం చేసి ప్రజల్లో అలజడి సృష్టించి రాజకీయ లబ్ది పొందాలని చూస్తున్నారని అది వారు ఆకాశం పైన ఉమ్మినట్లేనని అన్నారు.సంపాదన పైన ఆశ ఉన్నోడు మాటిమాటికి పార్టీలు మారుతారని జగన్నకు అలంటి అవసరం ఏమి లేదని ఆయనకు సంపాదనమీద ధ్యాస ఉంటె ఎప్పుడో ఆ పని చేసేవడాని అనేక ఫేమౌజులు కట్టుకునేవాడని సీజ్ బ్యాంకు లో పెట్టుకునేంత డబ్బు సంపాదించే వాడని జంగిటి అన్నారు.అయన తపనంత ప్రజల కోసమేనని ఎప్పుడు ప్రజా శ్రేయష్యే కోరుకుంటాడాని అందుకే సంగారెడ్డి ప్రజలు జగన్నను గెలిపిస్తున్నారని రాబోయే ఎన్నికల్లో బారి మెజార్టీతో గెలుస్తాడాని ఆశాభావం వ్యక్తం చేశాడు.మరోసారి ఇలాంటి దిగజారుడు ఎవరు మాట్లాడిన తగిన గుణపాఠం చెప్పడం జరుగుతుందని హెచ్చరించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *