నా భూమి-నా దేశం

షాద్ నగర్ ప్రజా తంత్ర సెప్టెంబర్ 01:“నెల్లి శ్రీవర్ధన్ రెడ్డి” రాష్ట్ర కార్యవర్గ సభ్యులు బిజెపి షాద్ నగర్ నియోజకవర్గం ఇంచార్జి

ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ గారు “నా భూమి-నా దేశం” కార్యక్రమంలో భాగంగా ప్రతి ఇంటి నుండి పిడికెడు మట్టి సేకరించి అమరవీరులను స్మరించుకుంటూ ఢిల్లీలో అమృత వాటిక నిర్మించాలని తలపించారు. ఇందులో భాగంగా ఈరోజు బిజెపి నాయకులు షాద్ నగర్ పట్టణం ఏబి విల్లాస్ లో మిలిటరీ లో పని చేసిన వెంకట్ రెడ్డి గారి ఇంటి నుండి మట్టి సేకరణ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిధి గా *రాష్ట్ర కార్యవర్గ సభ్యులు బిజెపి షాద్ నగర్ నియోజకవర్గం ఇన్చార్జి నెల్లి శ్రీ వర్ధన్ రెడ్డి గారు,* అందె బాబయ్య, విష్ణువర్ధన్ రెడ్డి, వంశీకృష్ణ, మల్చలం మురళి తదితరులు పాల్గొన్నారు.ఈ సందర్భంగా*నెల్లి శ్రీ వర్ధన్ రెడ్డి గారు మాట్లాడుతూ*

 ఎంతోమంది అమరవీరుల ప్రాణ త్యాగాలతో స్వాతంత్రం ఏర్పడి 75 సంవత్సరాలు నడుస్తున్న సందర్భంగా, నా భూమి-నా దేశం కార్యక్రమంలో భాగంగా దేశవ్యాప్తంగా ప్రతి ఇంటి నుంచి మట్టి సేకరించి ఢిల్లీలో పార్లమెంట్ ఆవరణలో అమరవీరులను స్మారక స్తూపం నిర్మించనున్నారని అన్నారు.
అమరవీరులను స్మరించుకుంటూ వారి యొక్క చరిత్ర ను రాబోయే తరాలకు అందించాలనే ఉద్దేశంతో నరేంద్ర మోడీ గారి కార్యక్రమాన్ని చేపట్టారని అన్నారు.దేశం లో మరోసారి జాతీయ భావాలను నేటి యువత లో మేల్కొల్పాలని అదేవిదంగా 2047 వరకూ స్వతంత్రం వచ్చి 100 సంవత్సరాలు పూర్తి అయిన అమృత కాలంలో అభివృద్ధి చెందిన భారతదేశం కోసం పిలుపునివ్వడం జరిగిందని అన్నారు.
కాబట్టి యువత అభివృద్ధి చెందిన దేశం కోసం, ధర్మం కోసం పాటు పడాలని అన్నారు.మట్టి సేకరణ కార్యక్రమం నేటి నుండి సెప్టెంబర్ 15 వరకు జరుగుతుంది అదేవిదంగా అక్టోబర్ 29 న ఢిల్లీ లో జరిగే అమృత వాటిక నిర్మాణం లో ఈ మట్టిని తీసుకెళ్లి 7500 చెట్లతో స్మృతి వనాన్ని నిర్మించి, ప్రతీ భారతీయుడికి గర్వంగా నిత్యం స్ఫూర్తి ప్రేరణ ఇచ్చేటువంటి గొప్ప నిర్మాణం కాబట్టి ఈ కార్యక్రమం లో అందరం భగస్వాములమవుదామని అన్నారు.ఆ నాడు స్వాతంత్రం ఎలా ఐతే పోరాటం చేసారో అలాగే పార్టీలకు, మతాలకు అతీతంగా కార్యక్రమం లో పాల్గొని అమరవీరులను స్మరించుకుందామని పిలుపునిచ్చారు.ఈ సందర్బంగా ప్రతి ఇంటి నుండి మహిళలు హరతులతో స్వాగతించి, మట్టిని ఇచ్చారు. ఈ కార్యక్రమం నిజంగా యువత ఎంతో స్ఫూర్తి అని హర్షం వ్యక్తం చేశారు.ఈ కార్యక్రమం లోశ్రీనివాస్ చారి, కిషోర్ రెడ్డి, జె నర్సింహా, హరి భూషణ్, జగదీశ్ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *