నాలుగోసారి కల్వకుర్తి బరిలో దిగనున్న జైపాల్ యాదవ్

ఆమనగల్లు, ప్రజాతంత్ర ఆగస్ట్ 21 : కల్వకుర్తి అసెంబ్లీ బరిలో టిఆర్ఎస్ అభ్యర్థిగా నాలుగోసారి కల్వకుర్తి ఎమ్మెల్యే గుర్క జైపాల్ యాదవ్ బరిలో దిగనున్నారు. రెండుసార్లు తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా ఒకసారి బి ఆర్ఎస్ నుంచి ఎమ్మెల్యేగా గెలుపొంది మరల 2023 – 24లో  బిఆర్ఎస్ అభ్యర్థిగా బరిలోకి దిగనున్నారు. అంచలంచలుగా ఎదుగుతున్న జైపాల్ యాదవ్ ఇంతింతై వటుడింతై అన్న చెందాగా కల్వకుర్తి ఎమ్మెల్యే జైపాల్ యాదవ్ రెండుసార్లు గ్రామ సర్పంచ్ గా ఎన్నికై తన రాజకీయ ప్రస్థానం మొదలుపెట్టారు. పూర్వపు తలకొండపల్లి మండలం ప్రస్తుతం కడ్తాల మండలంలో ఉన్న చెల్లంపల్లి గ్రామంలో 1954లో మంగమ్మ బలరాం యాదవ్ దంపతులకు రెండవ సంతానముగా జన్మించిన గుర్కా జైపాల్ యాదవ్ అనేక ఆటుపోట్లు గెలుపు ఓటములను అనుభవించారు. 1981 నుండి 1995 వరకు చల్లపల్లి గ్రామ సర్పంచ్ గా ఎన్నికయ్యారు. అనంతరం తెలుగుదేశం పార్టీ నుండి తలకొండపల్లి జెడ్పిటిసి గా గెలుపొందారు 1997 నుండి 1999 వరకు బీసీ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ గా పనిచేశారు. 1999 లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ నుండి మొదటిసారిగా ఎమ్మెల్యేగా గెలుపొంది అసెంబ్లీలోకి అడుగు పెట్టారు. 2006లో వంగూరు మండల జడ్పిటిసి గా పోటీ చేసి గెలుపొందారు. 2009లో అసెంబ్లీ ఎన్నికల్లో టిడిపి అభ్యర్థిగా రెండవసారి గెలుపొందారు. తదనంతరం రాజకీయ పరిణామాలతో 2014లో సీఎం కేసీఆర్ ఆధ్వర్యంలో బిఆర్ఎస్ లో చేరి తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన మొదటిసారి టిఆర్ఎస్ అభ్యర్థిగా పోటీ చేసి ఓటమిపాలయ్యారు. అనంతరం 2018లో బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి గెలుపొందారు. అనంతరం కల్వకుర్తి నియోజకవర్గ ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటూ ఎమ్మెల్యేగా తన వంతు కృషి చేస్తున్నారు. మరల ముఖ్యమంత్రి కేసీఆర్ ఆశీస్సులతో బి ఆర్ ఎస్ టికెట్ ను సొంతం చేసుకున్నారు. దీంతో ఆయన అనుచర గణం ఆయా మండలాల్లో బాణాసంచాలు కాల్చి మిఠాయిలు స్వీట్లు పంచిపెట్టారు. సంబరాల్లో మునిగి పోయారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *