- జనగామ జిల్లాలో 3 సీట్లు కైవసం చేసుకోవాలి
- జనగామ బీఆర్ఎస్ పార్టీ సమన్వయ సమావేశంలో పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్
హైదరాబాద్, ప్రజాతంత్ర, అక్టోబర్ 10 : వొచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీని జనగామ జిల్లాలోని 3 నియోజకవర్గాల్లో గెలిపించడానికి అందరూ సమన్వయంతో పనిచేయాలని కేటీఆర్ అన్నారు. ఈ నెల 16న జనగామలో నిర్వహించే ఎన్నికల మొదటి సభను విజయవంతం చేయాలని నాయకులకు విజ్ఞప్తి చేశారు.
హైదరాబాద్లోని మంత్రుల నివాస సముదాయంలో మంగళ వారం బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్..జనగామ జిల్లాకు చెందిన రాష్ట్ర మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి, టీఎస్ ఆర్టీసీ చైర్మెన్, ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి, రైతు బంధు సమితి చైర్మెన్, ఎమ్మెల్యే డా. టి రాజయ్య, మాజీ ఎమ్మెల్సీలు బోడకుంటి వెంకటేశ్వర్లు, నారదాసు లక్ష్మణ్ రావు, జనగామ నియోజకవర్గ ముఖ్య నాయకులతో సమన్వయ సమావేశం ఏర్పాటు చేశారు.





