కందుకూరు,ప్రజాతంత్ర,నవంబర్ 7: మహేశ్వరం నియోజకవర్గం ఎమ్మెల్యే అభ్యర్థి గుండ్రపల్లి అమరేందర్ మంగళవారం ధర్మ సమాజ్ పార్టీ తరపున ఎమ్మెల్యే అభ్యర్థిగా నామినేషన్ వేయడం వేయడం జరిగిందని అమరేందర్ తెలిపారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ,మహేశ్వరం నియోజకవర్గాన్ని నేటి వరకు అగ్రకులాలే రాజ్యమేలుతున్నాయని అన్నారు.నూటికి 90 శాతం ఉన్న బిసి,ఎస్సీ,ఎస్టీలు రాజ్యాధికారానికి దూరంగా ఉన్నారని అన్నారు.అందుకే ధర్మసమాజ్ పార్టీ బడుగు,బలహీనవర్గాలు రాజ్యాధికారం లోనికి రావాలంటే ధర్మసమాజ్ పార్టీతోనే సాధ్యమైతుందని అన్నారు.నా అణగారిన కులాలను అనేక ప్రలోభాలకు గురిచేసి నా వైపు రావలసిన నా ప్రజల ఓట్లను మోసంతో వేయించుకొని రాజ్యానికి వస్తున్నారని ఆయన ఆరోపించారు.అందుకే ధర్మ సమాజ్ పార్టీకి 90శాతం ప్రజల తమ వైపు నిలబడి ధర్మ యుద్ధం చేయడానికి సిద్దంగా ఉన్నారని అన్నారు. మహేశ్వరం గడ్డపైన ధర్మ సమాజ్ పార్టీ జెండా ఎగుర వేయుటకు బిసి,ఎస్సీ, ఎస్టీ ప్రజలు టార్చ్ లైట్ గుర్తుకు ఓటు వేసి నన్ను ఆశీర్వదిస్తారని మీబిడ్డగా కోరుతున్నానని అన్నారు.ఈ కార్యక్రమంలో ఏనుగుల జాషువా,గూడురు భాస్కర్,వూటు మహేష్, చిన్నగల్ల అంజయ్య,గులివి మహిపాల్,గులివి ప్రభాకర్,గులివి ప్రశాంత్,చింతకింది బాలరాజు తదితరులు పాల్గొన్నారు.
నామినేషన్ వేసిన ధర్మ సమాజ్ పార్టీ అభర్థి



