తాండూరు, ప్రజాతంత్ర నవంబర్ 4 : వికారాబాద్ జిల్లా తాండూరు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి బుయ్యని మనోహర్ రెడ్డి నామినేషన్ వేశారు. తాండూరు అసెంబ్లీ ఎన్నికలలో భాగంగా శనివారం కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి రంగారెడ్డి జిల్లా డిసిసిబి చైర్మన్ బియ్యాన్ని మనోహర్ రెడ్డి ఆ పార్టీ నేతలతో కలిసి మొదటి విడత నామినేషన్ ను పట్టణంలోని ఆర్డీఓ కార్యాలయంలో ఏర్పాటు చేసిన ఆర్ఓ కార్యాలయంలో ఎన్నికల నిబంధనల మేరకు ఎన్నికల రిటర్నింగ్ అధికారి ఎం.శ్రీనివాస్ రావుకు నామినేషన్ పత్రాలను అందజేశారు. మనోహర్ రెడ్డి వెంట కుటుంబ సభ్యులు, తో పాటు టీపీసీసీ ఉపాధ్యక్షులు ఎం.రమేష్ మహరాజ్, ప్రధాన కార్యదర్శి ధారాసింగ్, అధికార ప్రతినిధి కల్వ సుజాత తదితరులు ఉన్నారు.
నామినేషన్ వేసిన కాంగ్రెస్ అభ్యర్థి బుయ్యని మనోహర్ రెడ్డి



