సంగారెడ్డి, ప్రజాతంత్ర, నవంబర్ 7: నామినేషన్ల స్వీకరణలో ఎలాంటి పొరపాట్లు లేకుండా అభ్యర్థి సమర్పించే నామినేషన్ పత్రాలను తప్పులు లేకుండా క్షుణ్ణంగా పరిశీలించాలని, చెక్ లిస్ట్ ఆధారంగా సూచించుకోవాలని జిల్లా కలెక్టర్, ఎన్నికల రిటర్నింగ్ అధికారి డాక్టర్ శరత్ అన్నారు. మంగళవారం నారాయణఖేడ్ లో నామినేషన్ల స్వీకరణ కేంద్రాన్ని ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర శాసనసభ ఎన్నికల నోటిఫికేషన్ విలువడిన నేపథ్యంలో నామినేషన్లు సమర్పించేందుకు వచ్చే అభ్యర్థులకు అవసరమైన వసతులు ఏర్పాటు చేయాలని, హెల్ప్ డెస్క్ ద్వారా సహాయ సహకారాలు అందించాలన్నారు. అవసరమైన దరఖాస్తు ఫారాలను సిద్ధంగా ఉంచాలన్నారు. ఈసీ మార్గదర్శకాలకు అనుగుణంగా నియమ నిబంధనలు అన్ని అమలయ్యేలా చూడాలన్నారు. ఈ కార్యక్రమంలో ఖేడ్ రిటర్నింగ్ అధికారి ఎన్. వెంకటేష్, డిఎస్పీ వెంకట్ రెడ్డి, పోలీస్ , ఎన్నికల సిబ్బంది పాల్గొన్నారు.
నామినేషన్ పత్రాలను క్షుణ్ణంగా పరిశీలించాలి





