నామినేషన్ దాఖలు చేసిన తోటకూర వజ్రేష్ యాదవ్

కీసర,  ప్రజాతంత్ర , నవంబర్  09 :  కీసర  చౌరస్తా నుంచి   మేడ్చల్ నియోజకవర్గం ఎమ్మెల్యే అభ్యర్థి తోటకూర వజ్రష్ యాదవ్  భారీ ర్యాలీగా బయలుదేరి  మాజీ ఎమ్మెల్యే మలిపెద్ది సుధీర్ రెడ్డి,  టీపీసీ సీనియర్ అధికార ప్రతినిధి  సింగిరెడ్డి హరివర్ధన్ రెడ్డి, జిల్లా పరిషత్ చైర్మన్  మలిపెద్ది శరత్ చంద్రారెడ్డి,  కాంగ్రెస్  పార్టీ రాష్ట్ర నాయకులు నక్క ప్రభాకర్ గౌడ్ తో కలిసి  మేడ్చల్ జిల్లా కీసర ఆర్డీవో కార్యాలయంలో  రిటర్నింగ్ అధికారి రాజేష్ కుమార్ కు  గురువారం నామినేషన్ దాఖలు చేశారు. అంతకుముందు ఆయన  కాంగ్రెస్ పార్టీ నిర్వహించిన భారీ ర్యాలీలో మాట్లాడుతూ  నియోజకవర్గంలో  కాంగ్రెస్ హయాంలో జరిగిన అభివృద్ధి తప్ప బిఆర్ఎస్ ప్రభుత్వంలో ఏ అభివృద్ధి జరగలేదని అన్నారు.  మేడ్చల్ నియోజకవర్గం లో   మంత్రి మల్లారెడ్డి గెలిచిన తర్వాత తన కుటుంబం  అభివృద్ధి చెందింది తప్ప  నియోజవర్గం అభివృద్ధి  చెందలేదని తెలిపారు. మల్లారెడ్డి కి ఎవరు భూములు కబ్జా పెట్టాలని తపన తప్ప నియోజకవర్గాన్ని ఏవిధంగా అభివృద్ధి చేయాలో తెలియదని అన్నారు. బిఆర్ఎస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన అభివృద్ధి, సంక్షేమ పథకాలు  బిఆర్ఎస్ నాయకులకే వచ్చాయి కాని అర్హులైన పేద ప్రజలకు అందలేదని విమర్శించారు. మేడ్చల్ నియోజకవర్గం లోని రాంపల్లిలో  నిర్మించిన డబుల్ బెడ్ రూమ్  ఇండ్ల  కేటాయింపులో  స్థానికులకు అన్యాయం జరిగిన  పట్టించుకున్న పాపాన పోలేదని  అన్నారు. బి ఆర్ఎస్ పాలను అన్ని వర్గాల ప్రజలకు అన్యాయం జరిగిందని ఆయన పేర్కొన్నారు.  సంక్షేమ పథకాల పేరుతో  బిఆర్ఎస్ పేదలకు వంచనకు గురి చేసిందన్నారు.  మంత్రి మల్లారెడ్డి పై ప్రజలు తీవ్రంగా అసంతృప్తిగా ఉన్నారని తెలిపారు.   మల్లారెడ్డి స్టేజీలపై డ్యాన్సులు చేయడం తప్ప  నియోజవర్గ అభివృద్ధి గురించి పట్టించుకోలేదని విమర్శించారు.  రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి రాబోతుందని ధీమా వ్యక్తం చేశారు. తెలంగాణ ఇచ్చిన  తల్లి సోనియా గాంధీ  నాయకత్వాన్ని ప్రజలు కోరుకుంటున్నారని అన్నారు.  కాంగ్రెస్ పార్టీతోనే   ప్రజాస్వామ్య పాలన సాధ్యమవుతుందని తెలిపారు. ఎన్నికల్లో బిఆర్ఎస్  జిమ్మిక్కులు చేసిన  నమ్మే పరిస్థితిలో ప్రజలు లేరని విమర్శించారు. బి ఆర్ఎస్ ప్రవేశపెట్టిన  అభివృద్ధి,  సంక్షేమ పథకాలు ఏ ఒక్కటి పూర్తిస్థాయిలో అమలు కాలేదు అన్నారు. కాంగ్రెస్ పార్టీ ఆరు పథకాలకు  ప్రజల నుంచి విశేష స్పందన లభిస్తుందని తెలిపారు.  బిఆర్ఎస్ పాలనలో ప్రజలు విసిగిపోయి  కాంగ్రెస్ వైపు చూస్తున్నారని తెలిపారు. మేడ్చల్   గడ్డపై  కాంగ్రెస్ జెండా ఎగరవేస్తామని  తెలిపారు.  బిఆర్ఎస్ తెలంగాణను  అప్పుల తెలంగాణ రాష్ట్రంగా మార్చిందని  పేర్కొన్నారు.  అన్ని వర్గాల ప్రజలకు న్యాయం జరగాలంటే  కాంగ్రెస్ పార్టీని గెలిపించాలని ప్రజలను కోరారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *