చాలారోజులైంది
నన్ను నేను కలుసుకుని
కలవడం ఇష్టం లేకేం కాదు
బతుకు చక్రంలో బందినై
బయటకు రాలేక
బానే ఉన్నాను
బానే తిన్నాను
ఐనా ఏదో తెలియని వెలితి
అందరిలో ఉన్నాను
అందరితో ఉన్నాను
ఎందుకో నాతో నేను ఉండలేకపోయాను
అందరికీ సమయమిచ్చాను
ఎందుకో నాకు నేను
సమయం ఇవ్వలేకపోయాను
అందరూ మెచ్చిందే చేశాను
నాకు నచ్చిందెందుకో
వెనక్కి తోసేశాను
చాలా ఆలోచించాను…
నా ఆలోచనలో ఎందుకో
నేను లేకుండా పొయాను
బానే చదువుకున్నాను
ఎందుకో… నన్ను నేను చదవలేకపోయాను
డబ్బుకోసం పరుగులు తీశాను
నా కోసం మాత్రం
అడుగు కూడా వేయలేకపోయాను
బంధాల కోసం ముందున్నాను
ఎందుకో నాకు నేను
దూరపు బంధువులా ఉండిపోయాను
నాతో నేను
నాకు నేను దూరంగా ఉంటూ
ఈ ప్రపంచాన్ని దగ్గరగా ఉంటూ
నా ప్రపంచాన్ని పట్టించుకోనంత
తిరికలేని రోజు గడుపుతున్నాను
ఏంటో నేను
హడావిడిగా బయలుదేరాను
బతుకు చక్రంలో బందీనవడానికి
మళ్ళీ ఎప్పుడో
నన్ను నేను కలుసుకునేది

– రమావత్‌ ‌విష్ణు వర్థన్‌
 ‌రమాన్నగూడేం తండా (నల్లగొండ)
       7036890195

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *