నాటి ఫిరాయింపులే నేడు బి ఆర్ ఎస్ పై ఫిరంగులు

రాజకీయాల్లో ఒక రాజకీయ పార్టీకి విధేయుడిగా ఉంటూ ఆ రాజకీయ పార్టీ తరపున ఎన్నికలలో నిలబడి గెలిచి పదవులను పొందిన తరువాత అక్రమంగా మరొక పార్టీలో చేరడాన్ని ఫిరాయింపు లేదా పార్టీ ఫిరాయింపు అంటారు.
మన తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత అప్పటి టీ ఆర్ ఎస్  ప్రస్తుత బీఆర్ఎస్ పార్టీ మెజార్టీ సీట్లతో 63 స్థానాల్లో గెలిచి అధికారంలోకి వొచ్చింది. దోపిడీకి గురియైనది, నీళ్ళు, నిధులు, నియామకాల్లో, అన్యాయం జరిగింది అని సాధించుకున్న తెలంగాణలో నూతన రాష్ట్ర ప్రభుత్వం పరిపాలన మీద దృష్టి పెట్టాల్సిందిపోయి, పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహించింది.
మెజారిటీ ఉన్న,  ప్రతిపక్షం లేకుండా చేయాలి అన్న దురాలోచన తో  15మంది సభ్యులున్న టీడీపీ శాసనసభ పక్షం మొత్తాన్ని తమ పార్టీలో విలీనం చేసుకుంది. కొంతమందికి ఫార్టీ ఫిరాయింపు చట్టానికి వ్యతిరేకంగా మంత్రిలుగా  పదవులు కట్టబెట్టారు. కాంగ్రెస్ పక్షం నుంచి 12మంది ఎమ్మెల్యేలు టీఆర్ఎస్ లో చేరిపోయారు. ప్రతిపక్షాల నాయకులను తమపార్టీలో చేర్చుకుని టీఆర్ఎస్  స్థానాలకు పెంచుకొని తెలంగాణ ప్రజలను విస్మయానికి గురిచేసింది.

 

అహం తో చేసిన  వాక్యాలు పతనానికి దారితీస్తున్నాయి…
రాజకీయాల్లో ప్రతిపక్ష పార్టీలు ఉంటేనే ప్రజాస్వామ్యం బతకగలుగుతుంది. అధికార పక్షానికి ప్రతిపక్షం అనేది ఎప్పుడూ ప్రశ్నలతో పాలన గాడి తప్పకుండా ఒక యంత్రంవలే పనిచేస్తుంది. ప్రతిపక్షాన్ని లేకుండా చేసిన తమ విధానమే ప్రస్తుతం బీఆర్ఎస్ పార్టీ ఎదుర్కొంటున్నది,  కాలం ఎంత త్వరగా గుణపాఠం నేర్పిస్తుందో మనం ప్రస్తుతం బీఆర్ఎస్ పార్టీ పరిస్థితిని చూస్తే స్పష్టంగా అర్ధం అవుతుంది. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి ఆ పార్టీలో అనేక మంది మాకు టచ్ లో ఉన్నారు, మహారాష్ట్ర వలే ఏకనాథ్ షిండేలు ఉన్నారు, 39 సీట్లు చేతిలో పట్టుకొని మళ్ళీ కేసీఆర్  ప్రభుత్వం పగ్గాలు చేపట్టబోతున్నారు  ప్రకటిస్తు నేరుగా వాళ్ళే పార్టీని పతనావ్యవస్థకు తీసుకెళ్ళారు. పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహించే విధంగా ఉందని భావించిన  అధికార పార్టీ నాయకులు రంగంలోకి దిగి  బీఆర్ఎస్ పార్టీకి చెందిన నాయకులను తమ పార్టీలో చేర్చుకునే విధానానికి శ్రీకారం చుట్టారు.. గత పది ఏళ్లలో వాళ్ళు  చేసింది అదే కాబట్టి. వారికి నాటి ఫిరాయింపులే నేడు ఫిరంగులు అయినాయి.. బీఆర్ఎస్ నేర్పిన ఫిరాయింపుల రాజకీయాలు  నేడు  ఆ పార్టీకే ప్రమాదకరంగా మారిపొయ్యాయి.

 

 పదే పదే రేవంత్ రెడ్డి ప్రభుత్వం పడిపోతుంది అనే మాట తూటాల తయారవుతుంది…?
రేవంత్ రెడ్డి పదవి కోల్పోతాడు , ప్రభుత్వం పడిపోతది, మళ్ళీ అధికారం చేపట్టబోతున్నం అనే వ్యాఖ్యల  వలన,తెలంగాణలో లోక్‌సభ ఎన్నికలకు ముందు, తరువాత రాజకీయ నాయకులు కాంగ్రెస్ పార్టీలోకి ఫిరాయించడం జరుగుతూనే ఉంది, ఇటీవల లోకసభ ఎన్నికల్లో ఒక్క సీటు కూడా గెలుపొందకపోవడంతో, ఉన్న నాయకులకు భవిష్యత్తు ప్రశ్నార్థకంగా కనిపిస్తూ, రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి  ఆధ్వర్యంలో  ప్రజాప్రభుత్వం, రైతు రుణమాఫీకి రంగం సిద్ధం చేసి ఉంచారు, గ్యారెంటీ పతకాలు శరవేగంగా అమలు చేయుటకు ప్రణాళికను సిద్ధం చేస్తున్నారు కనుక, మరో కొంతమంది శాసనసభ్యులు జై కొడుతూ కాంగ్రెస్ పార్టీ వైపు చూస్తున్నారు, స్థానికంగా వారినే నమ్ముకున్న క్యాడర్,  కార్యకర్తలకు కూడా ఇప్పుడు గడ్డు పరిస్థితులు, వారి అగ్రనాయకులు నోటి దురుసుతోనే పార్టీ పరిస్థితి బలహీనతకు దారితీస్తుంది అని మొరపెట్టుకున్నారు., కాంగ్రెస్ పార్టీ  ఫిరాయింపులను ప్రోత్సహిస్తుంది అని వ్యాఖ్యలు చేస్తున్న బారసా నేతలు మనది అయితే సోమవారం మందిది అయితే మంగళవారం అన్నట్లు  యావత్ ప్రజాలోకానికి కనిపిస్తుంది….
-జాజుల దినేష్.
సామాజిక విశ్లేషకులు..
ఎంఏ. ఏంఎడ్‌, సెట్, పిజిడిసిఎ.
నల్గొండ..
9666238266

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *