రంగులన్నీ ఏకమై
మనుషులందరూ ఒక్కటై
కులమతభేదాలు మరచే
సమానత్వపు సంబరాల
రంగుల పండగ
హోళీకి స్వాగతం
అనురాగఆప్యాయతలకు
ఆలవాలమై,
ఆనందాలను
మనసులలో నింపుతూ
వ్యక్తినిర్మాణాన్ని చెక్కుకొనే
సంస్కృతిని
ప్రతిబింబించే పర్వమిది.
ప్రగతి శత్రువులైన
‘‘ఉచితాల’’
ప్రజాస్వామ్య కంటకాలైన
‘‘నిరంకుశ విధానాల’’ పీడ
కామదహనంలా,
మంటల్లో కాలి బూడిదైన ‘‘హోళి’’కలా,
రాబోయే రోజుల్లో విరగడవ్వడానికి
ఊరూ,వాడా నడుంబిగించాలి.
సమాజంలో కనుమరుగైన
‘‘సంతసాలు’’ మళ్లీ వెల్లివిరియడానికి,
జనుల బతుకు లోగిళ్ళు
వసంతమాసపు శోభ
తిరిగి పొందడానికి,
నువ్వూ,నేనూ,మనమందరం
ప్రతిన పూనాలి.
అందుకు ‘‘హోళీ’’ పర్వదినమే
నాందీ వాచకం పలకాలి.
-వేమూరి శ్రీనివాస్,
9912128967,
తాడేపల్లిగూడెం





