నవజాత శిశువును పీక్కుతిన్న కుక్కలు

పటాన్ చెరు, ప్రజాతంత్ర, నవంబర్ 1: ఏ అబాగ్యరాలు కన్నదో ఏమో కానీ నవజాత శిశువును కుక్కలు పీక్కు తిన్న సంఘటన బొల్లారం మున్సిపల్ పరిధిలోని గాంధీ నగర్ లో చోటు చేసుకుంది.పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం బుధవారం మధ్యాహ్నం ఒంటిగంట ప్రాంతంలో అప్పుడే పుట్టిన శిశువును ఒక బ్యాగులో తెచ్చి చెట్ల పొదల్లో పడేశారు.దీంతో కుక్కలు శిశువు సగం భాగం కాళ్ల నుండి మెడ వరకు తినేశాయి.మెడ,తల భాగం మాత్రమే మిగిలాయి.స్థానికుల సమాచారం మేరకు సంఘటన స్థలానికి పోలీసులు చేరుకుని దర్యాప్తు చేస్తున్నారు.సంఘటనా స్ధలాన్ని బొల్లారం బిజెపి పార్టీ అధ్యక్షుడు కేజేఆర్ ఆనందకృష్ణారెడ్డి సందర్శించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *