నకిలీ విత్తనాల డీలర్లపై ఉక్కుపాదం..!

విత్తనాలు, ఎరువులను సమకూర్చుకునే పనుల్లో నిమగ్నమయ్యి, విత్తనాల కొనుగోలులో ప్రభుత్వాలు మారిన రైతులు మోసపోతున్నారు, రోహిణి కార్తె ప్రవేశించడంతో వాల కాలం పంటల సాగుకు రైతులు దుక్కులు సిద్ధం చేస్తున్నారు. దళారుల దిగబడుల ఆశచూపి నకిలీ సరుకు అంటగట్టేందుకు కర్ణాటక, మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాల నుంచి నకిలీ విత్తనాలు రాష్ట్రంలోకి  ప్రవేశిస్తున్నాయి అంతర్రాష్ట్ర సరిహద్దు నుంచి రైల్వే మార్గంలో వస్తుండడంతో వాటి నియంత్రణ కష్టతరంగా మారింది.ఈ నేపథ్యంలో నకిలీ విత్తన దందాపై ఉక్కుపాదం మోపేందుకు తెలంగాణ ప్రభుత్వం ఆయా జిల్లాల్లో టాస్క్‌ ఫోర్స్‌ కమిటీలను నియమించింది. వ్యవసాయ, పోలీస్‌ అధికారులతో పాటు విత్తన ఉత్పత్తి సంస్థల భాగస్వామ్యంతో కమిటీ నియమించింది.రైతులు ఏట నకిలీ, కల్తీ విత్తనాలతో నష్టపోతున్నారు ఆరు కాలం శ్రమించిన పంట దిగుబడి రాకపోగా అప్పులపాలై అవస్థలు పడుతున్నారు. రాష్ట్రంలో వరి, పత్తి అధికంగా సాగు అవుతుండగా నకిలీ వరి విత్తనాలు సక్రమంగా మొలకెత్తకపోవడం, దిగబడి రాకపోవడం పరిపాటిగా మారింది కలుపు నాశనం మందులను తట్టుకునే జన్యూ మార్పిడి రకాలైన బీటీ -3 విత్తనాలతో పత్తి సాగులో శ్రమ తక్కువ ఉంటుందంటూ దళారులు ప్రచారాన్ని నమ్మి రైతులు వాటి కొనుగోలుకు మొగ్గు చూపుతున్నారు.

అయితే  గడ్డి మందు పిచికారి వల్ల ఆరోగ్య సమస్యలు వస్తున్నాయని క్యాన్సర్‌ వ్యాధి బారిన పడే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరించడంతో ప్రభుత్వం బీటీ-3 రకం పత్తి విత్తనాలను నిషేధించింది.అయితే పలుచోట్ల డీలర్లు మాత్రం వాటిని అధిక లాభాలకోసం రైతులకు విక్రయిస్తున్నట్టుగా ప్రచారం ఉంది.పైడి యాక్టులు పెట్టినా బీటీ పత్తి విత్తనాలకు తెగుళ్లను తట్టుకునే శక్తి ఉందని చెప్పి ఏటా నాలుగు వేల కోట్ల రూపాయల వ్యాపారాన్ని ప్రైవేటు కంపెనీలు చేస్తున్నాయి.

నకిలీ విత్తనాల భారీ నుండి బయటపడేందుకు రాష్ట్ర ప్రభుత్వం రైతులను అప్రమత్తత గా ఉండాలని ఆదేశించింది ముందుగా విత్తనాలు ఎరువులు కొనుగోలు చేసిన వెంటనే తప్పనిసరిగా రసీదు తీసుకోవాలి, అధికారులు సిఫార్సు చేసిన నాణ్యమైన అధిక దిగుబడి వచ్చే రకం విత్తనాలని ఎంచుకోవాలి, తక్కువ ధరకు అమ్ముతున్నారని నాసిరకం విత్తనాలను కొని నష్టపోవద్దు.లైసెన్స్‌ పొందిన డీలర్లు దుకాణదారుల వద్దనే కొనుగోలు చేయడం ఉత్తమం దళారుల మాటలు నమ్మి మోసపోకుండా జాగ్రత్తలు పాటించాల్సిన అవసరం ఉంది.రాష్ట్రంలో నకిలీ విత్తనాలు,ఎరువులు పై క్షేత్రస్థాయిలో చైతన్యం కల్పిస్తున్నారు.విత్తనాల ఎంపికలో రైతులకు ఆయా ప్రాంతాల్లో ఉన్న ఏఈఓలు, ఏవోలు మార్గదర్శకత్వం చేస్తున్నారు.సరుకు కొనుగోలు చేసిన వెంటనే తప్పనిసరిగా రసీదు తీసుకోవాలి నకిలీలను అరికట్టడానికి అన్ని జిల్లాల్లో టాస్క్ఫోర్స్‌ నిరంతరం పర్యవేక్షిస్తున్నది. మండలాల్లో ఇప్పటికే విత్తనాలు పంపిణీ ప్రారంభమైంది. అధికారులు తనిఖీలు ముమ్మరం చేశారు.అయితే పంపిణీలోనూ వ్యాపారుల చేతివాటం ప్రదర్శిస్తున్నారు.

ఈ నేపథ్యంలో ఖరీఫ్‌ సీజన్‌ ఆరంభంలో ఏటా కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాల సన్నద్ధతను బట్టి ఏ మేరకు దిగుబడులు పెరుగుతాయన్న విషయంలో స్పష్టత ఏర్పడుతుంది.ఏదైనా రాష్ట్రంలో అత్యధికంగా పండే విత్తనాలను వాటి కొరత ఉన్న రాష్ట్రాలకు తరలించే క్రమంలో కేంద్రం విఫలమైంది.కేంద్ర ప్రభుత్వం రికార్డు స్థాయిలో పంట దిగుబడులు సాధించాలని ఆదేశించడం తప్ప, రైతులకు డిమాండ్‌ ఉన్న విత్తనాలు ఇవ్వడం లేదనే విమర్శ ఉంది.నిన్నగాక మొన్న హఠాత్తుగా పుట్టుకొచ్చిన ప్రయివేటు విత్తన కంపెనీలు ఏటా వేల క్వింటాళ్ల విత్తనాలను రైతులకు అమ్మేస్తున్నాయి.దశాబ్దాల క్రితం వెలసిన ప్రభుత్వ విత్తనాభివృద్ధి సంస్థలు చేయలేని పన్ని,ఈ చిన్నపాటి కంపెనీలు ఎలా చేయకల్గుతున్నాయనేది వంద డాలర్ల ప్రశ్నతో నిఘా పెట్టడం వల్లనే నకిలీ,నాసిరకం విత్తనాల గుట్టురట్టయ్యి అన్నదాతలు ఊపిరి పీల్చుకుంటున్నారు.

గడచిన ఐదేండ్లలో ఎన్నడూ లేనంత త్వరగా ఈ సారి నైరుతి రుతుపవనాలు ముందుగానే పలకరిస్తాయని వాతావరణశాఖ వెల్లడిరచడంతో అన్నదాతల్లో ఆనందం వెల్లువిరుస్తుంది.ఈ ఏడాది అధిక వర్షపాతం నమోదు అవుతుందని,ఖరీఫ్‌ కు సరిపడ వర్షాలు కురుస్తాయని.రెండవ పంటకు డోకా ఉండదని అటు వాతావరణ శాఖ సైంటిస్టులు విశ్లేస్తున్నారు.ఇప్పటికే ఎన్నికల్లో హామీ ఇచ్చినట్టుగానే ధాన్యానికి 500రూపాయలు బోనస్‌ ప్రకటించి కొనుగోలు చేస్తుంది.అడపా దడపా చెడగొట్టు వర్షాలతో వ్యవసాయ పనులు షురూ కావడంతో విత్తనాలు, ఎరువుల కొనుగోళ్లు జోరందుకున్నాయి.రైతులకు మంచి దిగుబడులు సాధించాలంటే విత్తనాలే మూలాధారం.

ఇప్పటికే నకిలీ విత్తనాలతో రైతులు ఇబ్బందులు పడకుండా ప్రభుత్వం అవసరమైన చర్యలను తీసుకుంటున్నది.ప్రతి ఏడాది దళారులు చేసే మాయజాలంలో రైతులు మోసపోతున్నారు గతంలో ఓ వ్యాపారి విత్తన బ్యాగుపై ఉన్న ఎంఆర్పి ధరలు మార్చేసి ఎక్కువ రేట్‌ కి అమ్మినాడని, మరో వ్యాపారి విత్తనాలు మొలకెత్తుకుంటే తన బాధ్యత కాదంటూ రైతుల నుంచి ముందే బాండ్‌ పేపర్లపై సంతకాలు తీసుకోవడం అప్పట్లో కలకలం రేపింది.ఇలా వ్యాపారులు ఏదో ఒక రూపంలో రైతులను మోసం చేస్తూనే ఉన్నారు.ఈ నేపథ్యంలో రాష్ట్ర సరిహద్దు ప్రాంతాల్లో నిఘాను పటిష్టం చేశారు.ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే వాహనాలను విస్తృతంగా తనిఖీ చేస్తున్నారు.రాష్ట్ర సరిహద్దుల్లోకి నకిలీ విత్తనాలు ప్రవేశించకుండా చర్యలు తీసుకోవడంతో పాటు అవసరమైతే పీడీ యాక్ట్‌ కింద కేసులు నమోదు చేయడానికి సిద్ధమైంది.అయితే ఆధార్‌ కార్డు పై రెండు బ్యాగులు మాత్రం ఇవ్వడంతో  అన్నదాతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని పత్తి విత్తనాలు సరిపడా ఉన్నాయని తెలంగాణ ప్రభుత్వం స్పష్టం చేసింది.                                 ి
-డా. సంగనిమల్లేశ్వర్‌
విభాగాధిపతి, జర్నలిజం శాఖ,
కాకతీయ విశ్వవిద్యాలయం,
వరంగల్‌, 9866255355

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *