నకిలీ పాస్‌ పోర్ట్స్‌ తయారీ కేంద్రాలపై సిఐడి అధికారుల దాడి

సామాగ్రి స్వాధీనం…పోలీసుల అదుపులో తయారీదారుల ముఠా?


కోరుట్ల(జగిత్యాల), ప్రజాతంత్ర, జనవరి 19 : జగిత్యాల జిల్లాలోని కోరుట్ల పట్టణంలో నకిలీ పాస్‌పోర్ట్‌లు తయారు చేస్తున్న శిబిరాలపై హైదరాబాద్‌ నుండి వొచ్చిన ప్రత్యేక సిఐడి బృందం పోలీసులు ఏకకాలంలో దాడులు చేశారు. సిఐడి పోలీసులకు అందిన విశ్వసనీయ సమాచారం మేరకు జగిత్యాల జిల్లాకు వొచ్చిన సిఐడి డిఎస్‌పి నందిరామ్‌ ఆధ్వర్యంలోని పోలీసు బృందం శుక్రవారం ఉదయం కోరుట్ల పట్టణంలోని నకిలీ పాస్‌పోర్ట్‌లు తయారు చేస్తున్న వారి ఇండ్లపై ఏకకాలంలో దాడులు నిర్వహించారు.
కోరుట్ల పట్టణానికి చెందిన కంరుద్దీన్‌, చాంద్‌ పాషా, అశోక్‌ రావు ముగ్గురు నకిలీ పాస్‌పోర్ట్‌లు తయారుచేసి కొంతకాలంగా పలువురుని విదేశాలకు పంపిస్తున్నట్లు పోలీసులకు సమాచారం అందింది. దీంతో సిఐడి అధికారుల బృందం దాడులు నిర్వహించి నకిలీ పాస్‌పోర్ట్‌లు తయారు చేస్తున్న సామాగ్రిని పట్టుకున్నారు. తయారు చేస్తున్న బృంద సభ్యులలో ఒకరు ఇదివరకే విషయంపై జైలుకు వెళ్లి వొచ్చినట్లు తెలుస్తుంది. గత కొంతకాలంగా ఈ ముగ్గురు పలు నకిలీ పాస్‌పోర్ట్‌లను తయారుచేసి పలువురిని విదేశాలకు అక్రమంగా పంపినట్లు పోలీసులు భావిస్తున్నారు. పూర్తి వివరాలను ఇంకా పోలీసులు వెల్లడిరచలేదు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *