ధర్మ సమాజ్ పార్టీ మహేశ్వరం నియోజకవర్గం పార్టీ

కందుకూరు,ప్రజాతంత్ర,నవంబర్ 4 : కందుకూరు మండల కేంద్రంలో ధర్మ సమాజ పార్టీ రాష్ట్ర కార్యదర్శి బరిగల దుర్గాప్రసాద్ మహారాజ్ శనివారం ప్రారంభించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ,ధర్మ సమాజ్ పార్టీ ఈ ఎన్నికల్లో ధర్మ యుద్ధం ప్రారంభించడం జరిగిందని అన్నారు. తెలంగాణ రాష్ట్రంలో బిసి,ఎస్సీ,ఎస్టీలు నూటికి 90 శాతం ప్రజలు అణగారిన వర్గాలు సంపదకు,రాజ్యానికి,భూమికి దూరంగా ఉన్నారని అన్నారు.దేశానికి స్వతంత్రం వచ్చినప్పటినుండి అగ్రకులాలే రాజ్యం ఏలుతున్నారని,అనగారిన కులాలు రాజ్యం మీదికి రాలేదని అన్నారు.అణగారిన కులాలు రాజ్యం మీదికి తీసుకురావడం కోసం ధర్మ సమాజ్ పార్టీ ఎన్నికల బరిలోకి దిగిందని అన్నారు.మహేశ్వరం నియోజకవర్గం ఎమ్మెల్యే అభ్యర్థిగా గుండ్లపల్లి అమరేందర్ ను ఎన్నికల బరిలో పార్టీ తరపున నియమించడం జరిగిందని అన్నారు.కావున అధిక సంఖ్యలో పాల్గొని అమరేందర్ గెలుపు కోసం అహర్నిశలు పనిచేయాలని కార్యకర్తలకు,నాయకులకు పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో రంగారెడ్డి జిల్లా కన్వీనర్ రాకేష్,మహేశ్వరం మండలం ఇన్చార్జి అనూక్,బాలాపూర్, సరూర్ నగర్ ఇన్చార్జి రాము,కందుకూరు మండలం ఇన్చార్జి గూడూరు భాస్కర్, నాయకులు జాషువా,మహిపాల్,అంజయ్య, మహేష్,ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *