అమ్మవో, అవనివో,
ధరనివో, నేలతల్లి వో!
ఓ పుడమి తల్లి నీకు వందనం!!
నీ కడుపునుండీ పుట్టిన జీవహరంమే!
మానవ మనుగడకి ఆహారం!!
నీ వెచ్చని ఒడిలో పెరిగ
మెక్కలు చెట్ల మహ వృక్షాలు!
మాకు ఊపిరిలో ఊపిరైనవి!!
నేల తల్లి ని జీవనంతోనే
మాకు జీవితం!
నీ సమృద్ధితో మా సంతోషం!!
నీ శాంతి మా సౌఖర్యం!
నీ అందించినా అడవులు!!
నదులు,పర్వతాల సముద్రాలు!,
వనరులు మాకు వరం!!
అమ్మా నీవు మా నేలతల్లి!
మాకు జీవం ఇచ్చిన జనని!!
మాకు ఆహారం ఇచ్చిన
అన్నపూర్ణవి! నీవే తల్లి !!
మాకు ఆశ్రయం ఇచ్చిన
భూమాత నికువందనం!
నీవు అందించిన అడవులు
మమల్ని కాపాడుతునాయి!!
నీవు అందించిన నదులు
మా దాహం తీర్చుతునాయి!
నీ ఏధపై పర్వతాలు
మాభివృదికి ప్రమాణాలు!!
నీవు అందించిన సముద్రాలు
మానవసర్వతో అభివృదికిసగరాలు!!
మాప్రతిఅడుగులో!మాప్రతిశ్వసలో!!
అవని నీవే ఆధారం!!!
మట్టి బంగారం,మాకు జీవనాధారం!
పృథివీ మాకు ఆనంద నిలయం!!
అవనిమాకు శాంతిసభ్రతృత్వం!
అవని సంరక్షణ మా బాధ్యత!!
భూమి భవిష్యత్తు మా భవితవ్యం !!
నేలతల్లి నీ శ్రేయస్సు!
మాకు బంగారు భవిష్యత్!!
ఈ భూమిని కాపాడుకుందాం!
ఈ భూమిని ప్రేమించుకుందాం!!
ఈ భూమిని గౌరవిద్దాం!
ఈ భూమిని జాగ్రత్తగా చూసుకుందాం!!
మట్టి బంగారాన్ని దాచుకుందాం!
మానవ అభివృద్ధికినోచుకుందాం!!!
-పూసపాటి వేదాద్రి
9912197694




