ధనిక రాష్ట్రాన్ని కెసిఆర్ అప్పులు పాలు చేసిండు ఎన్ వి ఎస్ ఎస్ ప్రభాకర్

ఉప్పల్ , ప్రజాతంత్ర, నవంబర్ 23:  ధనిక రాష్ట్రాన్ని కెసిఆర్ అప్పులు పాలు చేసిండని, తొమ్మిదేళ్ల పాలనలో వేల కోట్లు అప్పులు చేసి బంగారు తెలంగాణను అప్పులు తెలంగాణగా మార్చారని ఉప్పల్ బిజెపి ఎమ్మెల్యే అభ్యర్థి ఎన్ వి ఎస్ ఎస్ ప్రభాకర్ అన్నారు. గురువారం నియోజకవర్గంలో ఎన్నికల ప్రచార పాదయాత్ర కార్యకర్తలతో కలిసి నిర్వహించారు. కమలం గుర్తుకే ఓటు వేసి ఉప్పల్లో బిజెపిని  అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ప్రభాకర్ ఓటర్లను అభ్యర్థించారు.ఈ సందర్భంగా ప్రభాకర్ మాట్లాడుతూఉప్పల్లో ప్రజా సమస్యలు తాండవిస్తున్నాయని,కార్పొరేటర్లు , బిఆర్ఎస్ ఎమ్మెల్యే , ప్రజా సమస్యలు పట్టించుకున్న పాపాన పోలేదని  ప్రభాకర్ ఆరోపించారు.ప్రజలు ఇబ్బంది పడుతుంటే సమస్యలను చూస్తూ పబ్బం గడిపే పార్టీలే తప్ప  ప్రజా సమస్యలు పట్టించుకోనే నాయడే లేరని ప్రభాకర్  దుయ్యబట్టారు.  ఉప్పల్ బిజెపి అభ్యర్థి  ప్రభాకర్ కార్యకర్తలతో మీర్పేట్ హెచ్ బి కాలనీ , తిరుమల నగర్, మంగాపురం కాలనీ ,ఇందిరానగర్, ఇంద్రనగర్ ఫేస్ టు, కృష్ణానగర్ ,వెంకటేశ్వర నగర్  కాలనీలో  పాదయాత్ర చేశారు. ఉప్పల్ లో నేను ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో చేసిన అభివృద్ధి కానీ టిఆర్ఎస్ ప్రభుత్వంలో చేసిన అభివృద్ధి ఏమీ లేదని అన్నారు. ప్రజలు ఇబ్బంది పడుతుంటే సమస్యలను చూస్తూ పబ్బం గడిపే పార్టీలే తప్ప  ప్రజా సమస్యలు పట్టించుకోనే నాయడే లేరని ప్రభాకర్  దుయ్యబట్టారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *