ధనిక రాష్ట్రం దివాలా

ధనిక రాష్ట్రం అంతలోనే

అప్పుల కుప్పగా మారింది

 

మిగులు నిధులు తరిగి

కొరతల దిగులు పెరిగింది

 

సిరి సంపదలు మాయమై

చిల్లర గళ్ళపెట్టె మిగిలింది

 

వ్యయానికి తగ్గ రాబడి రాక

దివాలా దిశగ కదులుతుంది

 

అందినకాడ అప్పుల కోసం

నానా తిప్పలు పడుతుంది

 

ఉద్యోగుల జీతాలు పించన్లు

చెల్లించలేని కడుబికారితనం

 

సంక్షేమ పథకాల అమలు

కిస్తులతో వెళ్లదీస్తున్న ధీనం

 

తలకు మించిన అప్పులు

దండగమారి ఖర్చులు వెరసి

 

రాష్ట్ర ఆర్థిక స్థితి అద్వాన్నం

సకల వ్యవస్థలు అస్తవ్యస్తం

 

ఇంత సంక్సోభం ముసిరినా

నేత తీరు మరలేదు సరికదా!

 

ఇంకా నవాబు పోకడ చందం

అస్సలు తగ్గేదేలేదన్న అహం

 

ఓయి గడీల పాలక దొరా !

మీ గారడీ మాటలు చెల్లవు

నయా డ్రామాలు రక్తి కట్టవు

నమ్మే ప్రజానీకం ఇక కరువు

పీఠాలు కదిలే కాలం షురువు

 

ఇకనైనా ఒంటెత్తు పోకడ వీడి

గట్టెక్కే మార్గం అన్వేషిస్తే సరి !

కాదంటే తెలంగాణ సమాజమే

తగు బుద్ధి చెప్పక తప్పదు మరి!

 

– కోడిగూటి తిరుపతి:9573929493

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *