దౌల్తాబాద్ మండల కేంద్రంలో గడపగడపకు కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యారెంటీలు

ప్రజాతంత్ర కొడంగల్ అక్టోబర్ 16:  దౌల్తాబాద్ మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ గారు ప్రవేశపెట్టిన 6 గ్యారంటీలను  దౌల్తాబాద్ కాంగ్రెస్ పార్టీ నాయకులు గడపగడపకు ప్రచారం చేశారు రాబోయే రోజులు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందని తెలంగాణ ప్రజలు 40 రోజులు ఓపిక పట్టాలని రానున్నది ఇందిరమ్మ రాజ్యం అని ఇందిరమ్మ రాజ్యం రాగానే ప్రజలందరికీ గడపగడపకు కాంగ్రెస్ పార్టీ ప్రవేశపెట్టిన ఆరు  గ్యారంటీల   పథకాలను అందిస్తామని ప్రజలకు భరోసాని ఇచ్చారు ప్రజలందరూ రాబోయే శాసనసభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి  ఓటు వేసి రేవంత్ రెడ్డికి అత్యధిక మెజారిటీని ఇచ్చి కాంగ్రెస్ పార్టీని గెలిపించుకుందామని ఈ సందర్భంగా వారు అన్నారు ఈ కార్యక్రమంలోకాంగ్రెస్ పార్టీ నాయకులు కూర్మని దస్తప్ప మాలికాడి జగన్ గౌడ్ యానగుంది తిరుపతి రెడ్డి  సూరారం సాయిలు మాలికాడి అంజి తదితరులు పాల్గొన్నారు..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *