దౌలాపూర్ అంగన్ వాడి కేంద్రాల్లో కుర్చీలు అందజేత

జగదేవపూర్, ప్రజాతంత్ర, డిసెంబర్ 28:  జగదేవపూర్ మండల పరిధిలోని దౌలాపూర్ గ్రామంలో అంగన్వాడీ కేంద్రంలో చిన్నారులకు నా వంతు సహకారంగా కుర్చీలను కాంగ్రెస్ పార్టీ యువ నాయకులు చిలుకూరి మహేందర్ రెడ్డి గురువారం అందజేశారు.అదేవిధంగా గ్రామంలోని రెండు అంగన్వాడి సెంటర్లలో చిన్నారులు కూర్చునేందుకు కుర్చీలను అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థులకు మన వంతు సహకారం అందజేస్తే వారి భవిష్యత్తుకు తోడ్పాటు అందించిన వారమవుతామని అన్నారు. ఈ కార్యక్రమంలో అంగన్వాడీ టీచర్లు వంటేరు సుజాత ,మంత్రి పుష్పలత దౌలాపూర్ పాఠశాల హెడ్ మాస్టర్ అమరేందర్ రెడ్డి, కేశమైన మహేందర్ యాదవ్, జూపల్లి మహేష్, మంత్రి సత్యనారాయణ, అంగన్వాడి విద్యార్థుల మాతృమూర్తులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *