రూ. 36వేల ఆర్థిక సహాయం అందజేత
ఆమనగల్లు, ప్రజాతంత్ర డిసెంబర్ 14 : ఆమనగల్లు పట్టణానికి చెందిన రవి కుటుంబానికి తోటి స్నేహితులు చేయూతనందించారు. ఏ ఆపద వచ్చినా తామున్నామని భరోసా కల్పిస్తున్నారు. ఆమనగల్లులోని ప్రభుత్వ జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాలలో 1998-1999 పదవ తరగతి బ్యాచ్ కు చెందిన చిన్ననాటి స్నేహితులు (పూర్వపు విద్యార్థులు) తమ బాల్య మిత్రుడైన రవికి ఇద్దరు ఆడపిల్లలు అందులో ఒకరు చెవిటి మరొకరు మూగ వారు వారి ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగా ఉండడంతో చిన్ననాటి మిత్రులు చేయి చేయి కలిపారు. వారిద్దరి చికిత్స ఖర్చులకై రూ. 36800/-లు పోగుచేసి ఆర్థిక సహాయం అందించి మానవత్వం చాటుకున్నారు.
ఈ కార్యక్రమం బాల్యమిత్రులు సయ్యద్ షరీఫ్, కోటి, నగేష్, సురేష్, సత్యంసింగ్ తదితరులు ఉన్నారు.





