దేశ శ్రేయస్సు కోసం విద్యార్థుల పరిశోధనలు ఉపయోగపడాలి

-ఇస్రో చైర్మన్ సోమనాథ్
ఐఐటీ హైదరాబాద్ లో
980 మందికి పట్టాలు

సంగారెడ్డి, ప్రజాతంత్ర, జూలై 15: దేశ శ్రేయస్సు కోసం విద్యార్థులు చేసే పరిశోధనలు   ఉపయోగపడే విధంగా ఉండాలని ఇస్రో చైర్మన్ సోమనాథ్ అన్నారు. శనివారం కంది మండల పరిధిలోని ఐఐటీ హైదరాబాద్ లో 12వ స్నాతకోత్సవ సంబరాలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన ఇస్రో చైర్మన్ సోమనాథ్ డిగ్రీ పూర్తి చేసుకున్న 980 మంది విద్యార్థులకు పట్టాలను అందజేశారు. సీఎస్సి విభాగంలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన కార్తీక్ బాలాజీకి భారత రాష్ట్రపతి బంగారు పతకాన్ని అందుకున్నారు. ఈ సందర్భంగా ఇస్రో చైర్మన్ సోమనాథ్ మాట్లాడుతూ మీరందరూ మా జ్ఞాన సమాజంలోని ఉన్నత స్థాయిని ఆక్రమించారని అన్నారు. వ్యక్తుల ఆరోగ్యం, దేశ ఆరోగ్యాన్ని నిర్ణయిస్తుందని తెలిపారు. మన దేశం బలీయమైన ఆర్థిక వ్యవస్థగా పరిణామం చెందడానికి వీలు కల్పించే మార్గాల్లో మీ వివేకాన్ని ఏకీకృతం చేయాలని పిలుపునిచ్చారు. ఇక్కడ విద్యా భ్యాసం పూర్తి చేసుకున్న విద్యార్థులు భావి భారతదేశాన్ని నిర్మించే పనిలో ఉన్నందున వారందరికీ ఆయన ప్రత్యేక శుభాకాంక్షలు తెలిపారు. బోర్డ్ ఆఫ్ గవర్నర్ చైర్మన్ డాక్టర్ బీ.వీ.ఆర్ రెడ్డి మాట్లాడుతూ ఆవిష్కరణకు, శ్రేష్ఠతకు.. విద్యాపరమైన ప్రతిభకు నిలువెత్తు నిదర్శనంగా నిలుస్తున్న భారతదేశంలోని ప్రముఖ విద్యా సంస్థ ఐఐటీ హైదరాబాద్ పట్ల తనకు ఉన్న అభిమానాన్ని పంచుకోవడానికి ఈ అవకాశాన్ని ఉపయోగించుకుంటాన్ని తెలిపారు. జ్ఞానం, నైపుణ్యాలు… డిగ్రీతో గ్రాడ్యుయేట్లు ఈ సంస్థ పరిమితులను విడిచి వెళ్లేటప్పుడు, భవిష్యత్తును తీర్చిదిద్దే శక్తి ఇప్పుడు తమ చేతుల్లో ఉందని గుర్తుంచుకోవాలన్నారు. ఉత్సాహం, బాధ్యతతో పనిని స్వీకరించాలన్నారు. సాంకేతికత పరివర్తన శక్తిని విశ్వసించాలని, సానుకూల మార్పును సృష్టించడానికి అచంచలమైన అంకితభావంతో అవిశ్రాంతంగా పని చేయాలని సూచించారు. అదేవిధంగా ఐఐటీ హైదరాబాద్ డైరెక్టర్ బీ.ఎస్ మూర్తి మాట్లాడుతూ మొదటిసారిగా ఎంటెక్లో 500 మంది విద్యార్థులు పట్టాలను అందుకోవడం ఎంతో ఆనందంగా ఉందన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *