దేశ రాజధానికి పొంచి ఉన్న వరద ముప్పు

న్యూ దిల్లీ, జూలై 24 : దేశ రాజధాని ఢిల్లీకి యమున ముప్పు ఇంకా తొలగిపోలేదు. సోమవారం కూడా యమునా నది డేంజర్‌ ‌మార్క్‌ను దాటి ప్రవహిస్తోంది. ఈ రోజు ఉదయం ఏడు గంటలకు పాత యమునా వంతెన దగ్గర నీటిమట్టం ప్రమాదకరస్థాయి (205.33 టర్లు) దాటి 206.56 వద్ద ప్రవహిస్తోంది. ఆదివారంతో పోలిస్తే ఇది కాస్త ఎక్కువే. యమునా నీటిమట్టం పెరగడంతో ఢిల్లీని మళ్లీ వరదలు ముంచెత్తుతాయనే ఆందోళన వ్యక్తమవుతోంది. దాంతో లోతట్టు ప్రాంత ప్రజలు సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని అధికారులు సూచించారు.

ఓల్ట్ ‌యమునా బ్రిడ్జ్ ‌సపంలో నది డేంజర్‌ ‌మార్క్ ‌దాటడంతో ట్రాఫిక్‌ అం‌తరాయం ఏర్పడింది. ఢిల్లీ నుంచి షహదారా మధ్య రాకపోకలు సాగించే రైళ్లను రద్దు చేశారు. ప్రస్తుతం ఢిల్లీలో నెలకొన్న పరిస్థితులపై లెప్టినెంట్‌ ‌గవర్నర్‌ ‌వీకే సక్సేనాతో కేంద్ర హోం మంత్రి అమిత్‌ ‌షా మాట్లాడారు. అలాగే దేశవ్యాప్తంగా పలు రాష్టాల్లో్ర భారీ వర్షాలు కురుస్తున్నాయి. వాతావరణ శాఖ కేరళకు ఆరెంజ్‌ అలర్ట్ ‌జారీ చేసింది. కర్ణాటకలో పలు ప్రాంతాల్లో పాఠశాలలకు సెలవులు ప్రకటించారు. మహారాష్ట్రలో కురుస్తున్న వర్షాల కారణంగా అక్కడి నదుల్లోకి భారీగా నీరు వచ్చి చేరుతోంది. ఈ వానల కారణంగా హరియాణాలో ఇప్పటివరకు 35 మరణాలు సంభవించాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *