దేశ ప్రజలపై అకృత్యాలను భారత్‌ ‌సహించదు: రాహుల్‌ ‌గాంధీ

ప్రజాతంత్ర ఇంటర్నెట్‌ ‌డెస్క్,అక్టోబర్‌ 17:’’ఆదివారం కౌల్‌ ‌బజార్‌లో జీన్స్ ‌మరియు గార్మెంట్స్ ‌ఫ్యాక్టరీ యజమానులు , ఉద్యోగులతో ఇంటరాక్ట్ అయ్యాను.. హైదర్‌ ‌జీ నడుపుతున్న 30 యంత్రాల చిన్న యూనిట్‌ను కూడా సందర్శించాను మరియు వ్యాపారంలో ఎదుర్కొంటున్న ఇబ్బందులను చర్చించాను. ప్రతి దుస్తులపైనా జీఎస్టీ విధించడం వల్ల వ్యాపారం, ఇల్లు నడపటం చాలా కష్టమైందని, అన్నింటిపైనా జీఎస్టీ కారణంగా ఇలాంటి అనేక యూనిట్లు మూతపడ్డాయని చెప్పారు. మహిళలచే నిర్వహించబడుతున్న ఒకటి లేదా రెండు చిన్న యూనిట్లు కలిగి ఉన్న కొన్ని ఇళ్లను కూడా సందర్శించాను .

ప్రభుత్వ సహకారం లేకుండానే యంత్రాలను అద్దెకు తీసుకోవాల్సి వస్తోందని, దీంతో తమకు అదనపు భారం పడుతుందని ఇక్కడి మహిళలు వాపోయారు.తప్పుడు జిఎస్‌టి వల్ల చాలా మంది మధ్యతరహా మరియు చిన్న వ్యాపారులు తమ యూనిట్లను మూసేయాల్సిన దుస్థితి ఏర్పడింది మరియు నేటికీ కొంతమంది వ్యాపారాలు చేస్తున్నా , తప్పుడు జిఎస్‌టి భారాన్ని మోయలేకపోతున్నారు. భారత్‌ ‌జోడో యాత్రలో ప్రతి వర్గాల వాణిని వింటున్నాం… వ్యాపారులు, యువకులు, రైతులు, కూలీల హక్కుల కోసం ఈ యాత్ర గళం విప్పనుంది. దేశ ప్రజలపై అకృత్యాలను భారత్‌ ‌సహించదు..’’
-రాహుల్‌ ‌గాంధీ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *