- అన్ని వర్గాల కలలను సాకారం చేసేలా బడ్జెట్
- శ్రీ అన్న పథకం అద్భుతమని ప్రకటించిన ప్రధాని మోదీ
న్యూ దిల్లీ, ఫిబ్రవరి 1 : ఏడు అంశాలు ప్రాధాన్యంగా రూపొందించిన బడ్జెట్ కొత్త ఇండియాకు గట్టి పునాది అవుతుందని ప్రధాని మోడీ అన్నారు. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన బడ్జెట్‌పై ఆయన స్పందిస్తూ…2047 లక్ష్యంగా పథకాలు రూపొందించిన ఈ బడ్జెట్ అన్ని వర్గాల కలలను సాకారం చేస్తుందని చెప్పారు. మహిళా సాధికారత కోసం నిధులు కేటాయించడంతో పాటు పీఎం విశ్వకర్మ ప్రోత్సాహకాన్ని ప్రకటించినట్లు చెప్పారు. రాష్ట్రాలకు వడ్డీలేని రుణాలు మరో ఏడాది పొడిగించామని అందుకోసం రూ.13.7 లక్షల కోట్లు కేటాయించామని అన్నారు. నిర్మలా సీతారామన్ ప్రకటించిన శ్రీ అన్న పథకం అద్భుతమని మోడీ ప్రశంసించారు. ఉద్యానవన పంటలకు చేయూత అందించడంతో పాటు వ్యవసాయ స్టార్టప్‌లకు ప్రత్యేక నిధి కేటాయించిన విషయాన్ని మోడీ గుర్తు చేశారు. ఫార్మారంగం అభివృద్ధిపై కేంద్రం ప్రత్యేక దృష్టి సారించిందన్న ఆయన..ప్రభుత్వ పథకాల లబ్దిదారులకు పాన్ కార్డును చేస్తామని అంగీకరించనున్నట్లు మోడీ స్పష్టం చేశారు.
కేంద్ర బడ్జెట్లో అన్ని వర్గాలకు న్యాయం జరిగిందని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పేర్కొన్నారు. రైతులు ,గ్రాణ ప్రాంతాలకు ఎక్కువ నిధులు కేటాయించి నట్టు చెప్పారు. చారిత్రక బడ్జెట్‌ను ప్రవేశపెట్టిన్నందుకు ఆర్ధికమంత్రి నిర్మలా సీతారామన్‌కు అభినందనలు అని అన్నారు. విశ్వకర్మలకు తొలిసారి బడ్జెట్లో స్థానం దక్కిందని.. బ్జడెట్లో అనేక ప్రోత్సహాకాలు ప్రకటించామని మోడీ పేర్కొన్నారు. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ ప్రసంగం అనంతరం ప్రధాని మోడీ మాట్లాడారు. అమృత్ కాల్ లో ప్రవేశపెట్టిన మొదటి బడ్జెట్ భారతదేశ అభివృద్ధి కోసం బలమైన పునాదిని నిర్మిస్తుందని మోడీ ఆశాభావం వ్యక్తంచేశారు. ఈ బడ్జెట్ పేద ప్రజలు, మధ్యతరగతి ప్రజలు, రైతులతో సహా అందరి ఆకాంక్షలను, కలలను నెరవేరుస్తుందని ప్రధాని నరేంద్ర మోదీ వ్యాఖ్యానించారు. ఈ బడ్జెట్ భారత అభివృద్ధితోపాటు గొప్ప సంకల్పాన్ని నెరవేరుస్తుందన్నారు. మహిళల కోసం ప్రత్యేక పొదుపు పథకాన్ని ప్రారంభించామని.. మహిళా సాధికారత కోసం ఎన్నో చర్యలు చేపట్టినట్లు ప్రధాని పేర్కొన్నారు.
ప్రజా ప్రయోజనాల కోసం ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుందని వివరించారు. దేశం కోసం కష్టపడి పనిచేసిన ’విశ్వకర్మ’ ఈ దేశ సృష్టికర్త అని ప్రధాని మోడీ పేర్కొన్నారు. తొలిసారిగా ’విశ్వకర్మ’ శిక్షణ, సహాయానికి సంబంధించిన పథకాన్ని బ్జడెట్లో తీసుకొచ్చినట్లు వివరించారు. విశ్వకర్మ కౌశల్ సమ్మాన్ ద్వారా సంపద్రాయ వృత్తుల వారికి చేయూతను అందించనున్నట్లు వివరించారు. ఈ బడ్జెట్ గ్రీన్ ఎనర్జీ, గ్రీన్ గ్రోత్, గ్రీన్ ఇన్‌ఫ్రాస్టక్చ్ర, గ్రీన్ జాబ్‌లను మరింత ప్రోత్సహించేలా స్థిరమైన భవిష్యత్తు కోసం రూపొందించినట్లు ప్రధాని మోడీ పేర్కొన్నారు. సాంకేతికత, కొత్త ఆర్థిక వ్యవస్థపై దృష్టి సారించామమని ప్రధాని నరేంద్ర మోదీ తెలిపారు. గ్రాణ, పట్టణ ప్రాంతాల్లోని మహిళల జీవితాలను సులభతరం చేయడానికి ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుంది.. మహిళా స్వయం సహాయక సంఘాలు వారి జీవితాన్ని మరింత మెరుగుపరుస్తాయి. ఇళ్లలో మహిళలకు సాధికారత కల్పించేందుకు ప్రత్యేక పొదుపు పథకం ప్రారంభించనున్నట్లు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తెలిపారు.



