ఆమనగల్లు, ప్రజాతంత్ర సెప్టెంబర్ 25 : భారతదేశంలో తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడడం ఖాయమని సి డబ్ల్యూ సి ప్రత్యేక ఆహ్వానితులు మాజీ ఎమ్మెల్యే చల్లా వంశీధర్ రెడ్డి అన్నారు. సోమవారం మండలంలోని ఆకుతోటపల్లి గ్రామంలో ప్రదేశ్ కమిటీ ఆధ్వర్యంలో ఇటీవల తుక్కుగూడలో జరిగిన కాంగ్రెస్ విజయభేరి భారీబహిరంగ సభలో ఏఐసీసీ నాయకురాలు సోనియా గాంధీ ప్రకటించిన 6 గ్యారంటీ స్కీములను గడప-గడపకు వెళ్లి ప్రజలకు వివరించారు. రానున్న ఎన్నికల్లో కాంగ్రేస్ పార్టీ ఘన విజయం సాదింస్తుందనీ ధీమా వ్యక్తం చేశారు. ప్రజలకు బిజెపి పార్టీ చేస్తున మోసాలను ఇంటింటికి వెళ్లి వివరించాలని తెలిపారు. ఇలాంటి మోస పూరిత ప్రభుత్వాలను రానున్న ఎన్నికల్లో ప్రజలు తగిన గుణపాఠం చెబుతారని అన్నారు. ఈకార్యక్రమంలో మాజీ జడ్పీటీసీ శ్రీపాతి శ్రీనివాస్ రెడ్డి, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు యట నర్సింహ, డీసీసీ అధికార ప్రతినిధి శ్రీనివాస్ రెడ్డి, ఆమనగల్లు మండల అధ్యక్షుడు తెల్గమల్ల జగన్, యూవజన కాంగ్రెస్ జిల్లా కార్యదర్శి కృష్ణ నాయక్, జిల్లా నాయకులు శ్రీశైలం, తాలూకా కార్యదర్శి అలిమ్, సురేష్ నాయక్, మహిళ మండల నాయకురాలు పార్వతి, ఖాదర్, షఫీ, బాలు, సాజిద్, మహేశ్, యూవజన కాంగ్రేస్ నాయకులు, సురేష్ నాయక్, సుదర్శన్, శ్రీకాంత్, ఫరిద్, సురేష్, జహంగీర్ బాబా పాల్గొన్నారు.




