దేశంలో మరోమారు 12 వేలు దాటిన కొరోనా కేసులు

కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడి
న్యూ దిల్లీ, జూన్‌ 22 : ‌దేశంలో కొరోనా కేసులు మళ్లీ పెరిగాయి. కొత్తగా 24 గంటల్లో 12,249 కరోనా పాజిటివ్‌ ‌కేసులు నమోదుకాగా 13 మంది మృతి చెందారని కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. ఇప్పటి వరకు దేశ వ్యాప్తంగా కరోనా కేసుల సంఖ్య 4.33 కోట్లకు చేరుకోగా 5.25 లక్షల మంది మృత్యువాతపడ్డారు. కరోనా నుంచి 4.27 కోట్ల మంది కోలుకోగా ప్రస్తుతం 81 వేల మంది చికిత్స తీసుకుంటున్నారు.

ఇవాళ ఒక్క రోజే 9862 మంది కరోనా వ్యాధి నుంచి కోలుకున్నారు. మహారాష్ట్ర(3659), కేరళట(2609), ఢిల్లీ(1383), కర్నాటక(738), తమిళనాడు(737) రాష్టాల్రలో అత్యధిక కేసులు నమోదవుతున్నాయి. ఇప్పటి వరకు దేశ వ్యాప్తంగా 196.45 కరోనా డోసులు పంపిణీ చేశామని కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *