న్యూ దిల్లీ, జూలై 22 : దేశంలో కొరోనా కేసులు భారీగా పెరుగుతున్నాయి. గత 3 రోజులుగా 20 వేలకు పైగా కోవిడ్ కేసులు నమోదవుతున్నాయి. గడిచిన 24 గంటల్లో 21 వేల 880 కొరోనా కేసులు రాగా..ఇప్పటి వరకు దేశంలో నమోదైన మొత్తం కేసుల సంఖ్య 4 కోట్ల 38 లక్షల 47వేల 065కు చేరింది. రోజువారీ పాజిటివిటీ రేటు 98.46శాతంగా నమోదు అయింది.
అలాగే మరణాలు 1.20శాతం ఉన్నట్లు కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ ప్రకటించింది. శుక్రవారం ఉదయం నుంచి శనివారం ఉదయం వరకు గడచిన 24 గంటల్లో కొరోనా వైరస్ బారిన పడిన వారిలో 60 మంది కోలుకోలేక చనిపోయారు. ప్రస్తుతం దేశ వ్యాప్తంగా ప్రస్తుతం లక్షా 49 వేల 482 యాక్టివ్ కేసులు ఉన్నాయి. కోవిడ్ నుంచి మరో 21 వేల 219 మంది కోలుకుని హస్పిటళ్ల నుండి డిశ్చార్జి అయ్యారు. కేంద్రం ఇప్పటి వరకు 201 కోట్లకు పైగా టీకా డోసులు పంపిణీ చేసింది.



